క్రీడాభూమి

వివరణ ఇవ్వాల్సిందే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రపంచ కప్ క్రికెట్ చాంపియన్‌షిప్‌లో సెమీస్ నుంచే వెనుదిరిగిన టీమిండియాకు కష్టాలొచ్చిపడ్డాయి. ముఖ్యంగా కోచ్ రవి శాస్ర్తీ, కెప్టెన్ విరాట్ కోహ్లీ విమర్శలకు సమాధానాలు చెప్పుకోలేక సతమతమవుతున్నారు. వీరికి ఇప్పుడు మరో అదనపు సమస్య ఎదురుకానుంది. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) పాలనాధికారుల బృందం (సీఓఏ) త్వరలోనే కోచ్, కెప్టెన్‌తో సమావేశమై, వరల్డ్ కప్‌లో టీమిండియా ప్రదర్శనపై వివరణను కోరనుంది. తదుపరి టోర్నీలు, సిరీస్‌లకు భారత జట్టును ఎంపిక చేయడంపై ఈ సమావేశం ప్రభావం తప్పకుండా ఉంటుందని అంటున్నారు. వరల్డ్ కప్‌లో టీమిండియా ఆడిన తీరుతోపాటు ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శనపై కూడా సుప్రీం కోర్టు నియమించిన సీఓఏ చైర్మన్ వినోద్ రాయ్, సభ్యులు డయానా ఎడుల్జీ, లెఫ్టినెంట్ కల్నల్ (రిటైర్డ్) రవి థోడ్గే దృష్టి సారించనున్నట్టు సమాచారం. అదే విధంగా జాతీయ సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్‌తోనూ వీరు చర్చలు జరిపి, వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే టీ-20 వరల్డ్ కప్ కోసం ఇప్పటి నుంచే కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేస్తారని తెలుస్తోంది. భారత జట్టు కోచ్, కెప్టెన్ స్వదేశానికి తిరిగి వచ్చిన వెంటనే వారితో వరల్డ్ కప్ రివ్యూ మీటింగ్ ఉంటుందని, రాబోయే కాలంలో టీమిండియా కూర్పు గురించి సెలక్షన్ కమిటీతో చర్చిస్తామని వినోద్ రాయ్ పీటీఐతో మాట్లాడుతూ చెప్పారు. అయితే, సమావేశంలో చర్చించే అంశాలనుగానీ, ఇతర వివరాలనుగానీ తెలిపేందుకు రాయ్ నిరాకరించారు.
చర్చకు రాయుడు అంశం!
తెలుగు తేజం అంబటి రాయుడు పట్ల సెలక్షన్ కమిటీ వ్యవహరించిన తీరు కూడా కోచ్, కెప్టెన్, సెలక్షన్ కమిటీ చైర్మన్‌తో జరిపే చర్చల్లో సీఓఏ ప్రస్తావిస్తుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగేందుకు రాయుడు సమర్థుడు కాడని భావించిన తరుణంలో, ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన సిరీస్ చివరి వరకూ అతనిని జట్టులో ఎందుకు కొనసాగించారని సీఓఏ నిలదీసే అవకాశం ఉంది. ప్రపంచ కప్‌లో పాల్గొనే జట్టును ప్రకటించినప్పుడు రిజర్వ్‌డ్ ఆటగాళ్లలో రాయుడు ఉన్నాడు. అయితే, జట్టులోని ఆటగాళ్లు గాయాలబారిన పడినప్పుడు అతనిని జట్టులోకి ఎందుకు తీసుకోలేదన్న ప్రశ్నకు ఎవరి వద్దా సరైన సమాధానం లేదు. జాతీయ సెలక్షన్ కమిటీతోపాటు, జట్టు మేనేజ్‌మెంట్ కూడా తన పట్ల వ్యవహరించిన తీరుతో ఆవేదనకు గురైన రాయుడు హఠాత్తుగా కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. ఇంకా ఎంతో భవిష్యత్తు ఉన్న, సమర్థుడైన ఆటగాడు రిటైర్మెంట్ ప్రకటించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. కాబట్టి, ఈ అంశాన్ని సీఓఏ సభ్యులు లేవనెత్తడం ఖాయంగా కనిపిస్తున్నది.
ముగ్గురు వికెట్ కీపర్లా!
ప్లేయింగ్ ఎలెవెన్‌లో ముగ్గురు వికెట్‌కీపర్లు ఉండాన్ని అటు విమర్శకులు, ఇటు అభిమానులు తప్పుపడుతున్నారు. వెటరన్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ ఉండగా, దినేష్ కార్తీక్, రిషభ్ పంత్‌ను ఎందుకు తుది జట్టులోకి తీసుకోవాల్సి వచ్చిందనే ప్రశ్న తలెత్తుతోంది. ధోనీ కీపర్‌గా సేవలు అందించిన నేపథ్యంలో, కార్తీక్, పంత్‌ను స్పెషలిస్టు బ్యాట్స్‌మెన్ కోటాలో మ్యాచ్‌లు ఆడించి ఉండాలి. అదే నిజమైతే, పంత్‌తో కీపింగ్ చేయిస్తే, మరో స్పెషలిస్టు బ్యాట్స్‌మన్‌కు అవకాశం దక్కేది కదా? అన్నది చాలా మంది అడుగుతున్న ప్రశ్న. మరోవైపు వనే్డ ఇంటర్నేషనల్స్‌లో కార్తీక్ రికార్డు చాలా దారుణంగా ఉంది. వరల్డ్ కప్ టోర్నీకి ముందు జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లోనూ అతని ప్రదర్శన అంతంత మాత్రమే. అతనిని పనిగట్టుకొని వరల్డ్ కప్ టోర్నీకి ఎందుకు ఎంపిక చేయాల్సి వచ్చిందో సెలక్షన్ కమిటీ చెప్పితీరాలి. ముగ్గురు కీపర్లను మ్యాచ్‌ల్లో ఆడించడంపై సీఓఏ ప్రశ్నలను సంధించే అవకాశాలున్నాయి.
ఆ నిర్ణయం ఎవరిది?
మాంచెస్టర్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీస్‌లో ధోనీ బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చాలన్న నిర్ణ యం ఎవరిది? అతడిని ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దింపాలని ఎవరు సూచించారు? ఎందుకు అమలు పరిచారు? ఈ ప్రశ్నలకు కూడా కోచ్ రవి శాస్ర్తీ, కెప్టెన్ విరాట్ కోహ్లీ సమాధానాలు ఇచ్చుకోక తప్పదు. కేవలం ఐదు పరుగులకే మూడు వికెట్లు కూలిన తరుణంలో, ధోనీ వంటి వెటరన్ ఆటగాడి ని బరిలోకి దించకుండా, ఏడో స్థానంలో పంపడం కూడా టీమిండియా పరాజయానికి ఒకానొక కారణమన్న వాదన బలంగా వినిపిస్తున్నది. బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగార్ చేసిన సూచనను కోచ్ రవి శాస్ర్తీ సమర్థించాడని, ఫలితంగానే ధోనీకి బ్యాటిం గ్ ఆర్డర్‌లో డిమోషన్ తప్పలేదని అంటున్నారు. ఈ విషయాన్ని కూడా సీఓఏ సభ్యులు ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయని పేరు చెప్పడానికి ఇష్టపడని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు అన్నారు. జాతీయ జట్టుకు ఆటగాళ్లను ఎంపిక చేసే సమయంలో సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ అంతా తానై వ్యవహరిస్తున్నట్టు విమర్శలు ఉన్నాయని ఆ అధికారి తెలిపారు. బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం వరకూ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ కొనసాగుతుందని అన్నా రు. కమిటీలోని సభ్యులు శరణ్‌దీప్ సింగ్, దేవాంగ్ గాంధీ ఎంపికలో కీలక పాత్ర పోషించడం లేదని, కనీసం తమ సలహాలు, సూచనలు కూడా ఇవ్వడం లేదని సదరు అధికారి అన్నాడు. దిలీప్ వెంగ్‌సర్కా ర్ స్థాయిలో సూచనలు ఇవ్వలేకపోయినా, తమ అభిప్రాయాలను వెల్లడించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. జతిన్ పరాంజపే, గగన్ ఖోడా చేరిక తర్వాతే సెలక్షన్ కమిటీ బలోపేతమవుతుందన్నాడు. సెలక్షన్ విధానం, కొంత మంది సభ్యులు నామమాత్రంగానే కొనసాగడం వంటి అంశాలనూ సీఓఏ ప్రశ్నిస్తుందని ఆ అధికారి స్పష్టం చేశాడు. మొత్తం మీద కోచ్, కెప్టెన్, సెలక్షన్ కమిటీ చైర్మన్ పలు ప్రశ్నలకు సమాధానాలు, వివరణలు ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది. అందుకే, వరల్డ్ కప్‌లో టీమిండియా ప్రదర్శనపై పూర్తి సమాచారం సేకరించనుంది. భవిష్యత్ టూర్లు, సిరీస్‌ల్లో టీమిండియా ఎంపికపైనా దృష్టి సారించనుంది.