క్రీడాభూమి

వింబుల్డన్ రాణి సిమోనా హాలెప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 13: ప్రతిష్టాత్మకమైన వింబుల్డన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను ప్రపంచ ఏడో ర్యాంక్ క్రీడాకారిణి సిమోనా హాలెప్ కైవసం చేసుకుంది. ఎంతో ఉత్కంఠ భరితంగా, హోరాహోరీగా సాగుతుందనుకున్న శనివారం నాటి ఫైనల్ దాదాపు ఏక పక్షంగా ముగిసింది. హాలెప్ 6-2, 6-2 ఆధిక్యంతో తిరుగులేని విజయాన్ని నమోదు చేసి, కెరీర్‌లో రెండో గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను అందుకుంది. గత ఏడాది ఆమె ఫ్రెంచ్ ఓపెన్‌లో విజేతగా నిలిచింది. కాగా, బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తిరిగి అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించిన 37 ఏళ్ల సెరెనా ఏడాది కాలంలో మూడోసారి గ్రాండ్ శ్లామ్ టెన్నిస్‌లో టైటిల్ దక్కించుకునే అవకాశాన్ని చేజార్చుకుంది. గత ఏడాది వింబుల్డన్‌లో ఫైనల్ చేరినప్పటికీ, ఏంజెలిక్ కెర్బర్ చేతిలో 3-6, 3-6 తేడాతో పరాజయాన్ని చవిచూసింది. ఆతర్వాత యూఎస్ ఓపెన్‌లోనూ ఫైనల్ చేరినా ఫలితం లేకపోయింది. నవోమీ ఒసాకా ఆమెను 6-2, 6-4 ఆధిక్యంతో ఓడించింది. ముచ్చటగా మూడోసారి వచ్చిన అవకాశాన్ని కూడా సెరెనా చేజార్చుకుంది. మహిళల టెన్నిస్‌లో అత్యధికంగా 24 గ్రాండ్ శ్లామ్ టైటిళ్లను సాధించిన మార్గరెట్ కోర్ట్ రికార్డును సమం చేయలేకోయింది. ప్రస్తుతం సెరెనా ఖాతాలో 23 టైటిళ్లు ఉన్నాయి.

చిత్రం... వింబుల్డన్ రాణి సిమోనా హాలెప్