క్రీడాభూమి

స్పెషల్ కాయిన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 13: వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల, పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాస్‌కు రూపొందించిన ప్రత్యేక కాయిన్ అందరినీ ఆకట్టుకుంటున్నది. నాణానికి ఒకవైపు వింబుల్డన్ టోర్నీ లోగో ఉంది. మరోవైపు ‘56’ స్పష్టంగా కనిపించేలా, ఆకాశంలోకి దూసుకెళుతున్న పక్షి బొమ్మ ఉంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్‌ఎస్) గత ఏడాది చేపట్టిన తన 56వ అంతరిక్ష యాత్ర విజయవంతమైనందుకు గుర్తుగా ఆ అంకెను ఉంచారు. ఐఎస్‌ఎస్ నిర్వహించిన మూడు రోదశీ యాత్రల్లో కీలక పాత్ర పోషించిన కమాండర్ డ్రూ ఫ్యూస్టెల్ ఈ నాణాన్ని తాను, తన భార్య ఇందిర కలిసి రూపొందించినట్టు చెప్పాడు. ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ చైర్మన్ ఫిలిప్ బ్రూక్ కూడా తమకు సహకరించాడని తెలిపాడు. వింబుల్డన్ ప్రత్యేకతను, ఐఎస్‌ఎస్ సాధించిన విజయాను గుర్తుకు తెచ్చేలా ఈ నాణెం ఉందని అమెరికాకు చెందిన వ్యోమగామి ఫ్యూస్టెల్ అన్నాడు.