క్రీడాభూమి

అటా? ఇటా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంగ్లాండ్ క్రీడాభిమానులకు కొత్త సమస్య ఎదురైంది. ‘క్రికెట్ మక్కా’ లార్డ్స్ మైదానంలో ఆదివారం జరిగే వరల్డ్ కప్ క్రికెట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌ను చూచూడాలా? లేక టెన్నిస్‌లో అనధికార ప్రపంచ కప్, ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్ శ్లామ్ తుది పోరును తిలకించాలా? అన్నది తేల్చుకోలేక సతమతమవుతున్నారు. వరల్డ్ కప్ ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఇంగ్లాండ్ ఢీ కొంటుంది. వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నంబర్ వన్, డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్‌తో స్విస్ వెటరన్ ఆటగాడు రోజర్ ఫెదరర్ తలపడతాడు. ఈ రెండు ఈవెంట్స్ ఆదివారం నాడే జరగనుండడంతో, దేనికి ప్రాధాన్యం ఇవ్వాలో తేల్చుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు అభిమానులపై పడింది.
టీమిండియా సెమీస్ నుంచే వెనుదిరగడంతో, ఫైనల్ టికెట్లను అమ్మాల్సిందిగా భారత అభిమానులను అటు ఐసీసీ అధికారులు, ఇటు ఇంగ్లాండ్ క్రికెటర్లు కోరుతున్నారు. ఎంత మంది స్పందిస్తారో చూడాలి.

చిత్రాలు.. ‘క్రికెట్ మక్కా’ లార్డ్స్ *వింబుల్డన్ సెంట్రల్ కోర్టు