క్రీడాభూమి

బార్లు బంద్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్లింగ్టన్, జూలై 13: నైట్ బార్ల తలుపులు తెరుచుకోకపోతే, మందు ఎలా దొరుకుతుంది? ఇంగ్లాండ్‌తో ఆదివారం జరిగే ఫైనల్‌ను ఎక్కడ చూడాలి? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెత్తుకోవడంలో న్యూజిలాండ్ క్రికెట్ అభిమానులు మల్లగుల్లాలు పడుతున్నారు. లండన్‌లోని ‘క్రికెట్ మక్కా’ లార్డ్స్ మైదానం వేదికగా న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్‌ని తిలకించాలన్న ఉత్సాహం ఉన్నా, ఎలా చూడాలన్న ప్రశ్న వారిని వేధిస్తున్నది. న్యూజిలాండ్ కాలమానం ప్రకారం మ్యాచ్ రాత్రి 9.30 గంటలకు ప్రారంభమై, ఉదయం 5.30 గంటలకు ముగుస్తుంది. ఏవైనా మేజర్ టోర్నమెంట్లు ఉన్నప్పుడు నైట్ క్లబ్స్ ప్రత్యేకంగా లైసెన్స్ తీసుకుంటాయి. సాధారణ రోజుల్లో 11 గంటలకు మూతపడే బార్లు, లైసెన్స్ ఉంటే తెల్లవారు ఝామున నాలుగు గంటల వరకూ తెరచి ఉంచుకోవచ్చు. అయితే, దరఖాస్తు చేసుకున్న తర్వాత లైసెన్స్ రావడానికి కనీసం 20 పనిదినాలు అవసరం. ఇప్పుడు అంత సమయం లేదు కాబట్టి, బార్లు, నైట్ క్లబ్‌లు రాత్రి పదకొండు తర్వాత మూత పడతాయి. అదే జరిగితే, మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని చూడాలనుకుంటున్న తమ పరిస్థితి ఏమిటన్నది అభిమానుల ప్రశ్న.
ఊహించకపోవడమే కారణం
ఫుట్‌బాల్ లేదా టెన్నిస్.. హాకీ లేదా క్రికెట్.. ఒలింపిక్స్ లేదా ఇతర ఈవెంట్స్‌లో జరిగే వరల్డ్ కప్ సిరీస్.. మేజర్ ఈవెంట్స్ సమయంలో బార్లు, నైట్ క్లబ్‌లు ప్రత్యేక లైనెస్స్‌ను కొన్ని నెలల ముందుగానే తీసుకుంటాయి. కానీ, యజమానులు ఎవరూ అసలు దరఖాస్తులే చేసుకోలేదు. వరల్డ్ కప్‌లో కివీస్ ఫైనల్ చేరుతుందని ఊహించకపోవడమే అందుకు ప్రధాన కారణం. అంతకు ముందు జరిగిన పలు టోర్నీలు, సిరీస్‌ల్లో జట్టు ఆట తీరును గమనించిన తర్వాత, వరల్డ్ కప్‌లో నాకౌట్ దశకైనా చేరుతుందా? అనే అనుమానం వ్యక్తమైంది. కేన్ విలియమ్‌సన్ నాయకత్వంలోని న్యూజిలాండ్ జట్టు గ్రూప్ దశ నుంచే నిష్క్రమించడం ఖాయమని దాదాపు ప్రతి ఒక్కరూ అనుకున్నారు. వారి అంచనాలను తారుమారు చేస్తూ, కివీస్ సెమీస్ చేరడంతో, అభిమానుల్లో ఆసక్తి, మ్యాచ్‌లకు డిమాండ్ పెరిగాయి.
అయితే, సెమీస్‌లో పటిష్టమైన టీమిండియాను ఓడించి ఫైనల్ చేరడం విలియమ్‌సన్ సేనకు అసాధ్యమన్న అనుమానం వారిని వెంటాడింది. కానీ, అందరి అంచనాలను తారుమారు చేస్తూ కివీస్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ పరిణామం సహజంగానే అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఫైనల్ పోరును చూడాలన్న ఆసక్తిని వారిలో రేపింది. అయితే, బార్లలో మందు తాగుతూ, మ్యాచ్‌ని చూసి కేరింతలు కొడుతూ ఆనందాన్ని మిగతా వారితో పంచుకోవాలని అనుకుంటున్న అభిమానులకు ఇప్పుడు దిక్కుతోచడం లేదు. ‘ప్రత్యేక లైనెస్స్‌ను తీసుకోలేదు కాబట్టి, తెల్లవారే వరకూ బార్లు, నైట్ క్లబ్‌లు ఉండవు. అవి లేకపోతే, మందు దొరకదు. మందు కొట్టకపోతే, మ్యాచ్‌ని ఆస్వాదించడం కుదరదు.. ఇదేం పరిస్థితి? నలుగురితో కూర్చొని, ఫైనల్‌ను ఎంజాయ్ చేయడానికి వీలుండదు. ఆ ఒక్క రోజు బార్లు, నైట్ క్లబ్‌లను తెల్లవారు జాము వరకూ నడుపోవచ్చని అధికారులు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేస్తే బాగుటుంది. లేకపోతే, న్యూజిలాండ్ గెలిచినా.. ఆ ఆనందాన్ని పంచుకోవడానికి ఎవరూ ఉండరు’ అని ఓ క్రికెట్ అభిమాని వాపోయాడు. దాదాపుగా అందరి పరిస్థితి కూడా అదే.