క్రీడాభూమి

థామస్ కప్ విజేత డెన్మార్క్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కన్హాన్ (చైనా), మే 22: బాడ్మింటన్ పురుషుల టీం ఈవెంట్ థామస్ కప్ చాంపియన్‌షిప్‌ను డెన్మార్క్ మొట్టమొదటి సారి కైవసం చేసుకుంది. ఆదివారం నాటి ఫైనల్‌లో ఈ జట్టు ఇండోనేషియాను 3-2 తేడాతో ఓడించింది. విక్టర్ అక్సెల్సెన్ 21-17, 21-18 తేడాతో టామీ సుగియార్తోను ఓడించి డెన్మార్క్‌కు శుభారంభాన్ని అందించాడు. ప్రత్యర్థి నుంచి ఎదురైన ప్రతిఘటనను అక్సెల్సెన్ సమర్థంగా ఎదుర్కొని, వరుస సెట్లలో విజయాన్ని నమోదు చేసి డెన్మార్క్‌కు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. అయితే, డబుల్స్ విభాగంలో జరిగిన తొలి మ్యాచ్‌లో ఇండోనేషియా జోడీ మహమ్మద్ అసన్, హెండ్రా సెతియవాన్ జోడీ 21-18, 21-13 ఆధిక్యంతో వరుస సెట్లలో మాడ్స్ కాన్డ్ పెటెర్సెన్, మాడ్స పీలర్ కోల్డింగ్ జోడీని ఓడించింది. రెండు జట్లు సమవుజ్జీగా నిలిచిన సమయంలో డెన్మార్క్ స్టార్ ఆటగాడు జాన్ జొర్గెనె్సన్ అసాధారణ ప్రతిభ కనబరిచాడు. ఆంథోనీ సినిసుకా గింటింగ్‌తో జరిగిన మ్యాచ్‌ని అతను 21-17, 21-12 తేడాతో సొంతం చేసుకొని డెన్మార్క్‌కు 2-1 ఆధిక్యాన్ని సంపాదించిపెట్టాడు. కానీ, అతని సంతోషం ఎక్కువ సేపు నిలవలేదు. ఇండోనేషియా డబుల్స్ జోడీ ఆంగా ప్రతమా, రికీ కరాండా సువార్డీ 21-16, 21-14 తేడాతో కిమ్ ఆస్టర్ప్, ఆండర్స్ స్కారప్ రస్మునె్సన్ జోడీని చిత్తుచేసి తిరిగి స్కోరును తిరిగి సమం చేశారు. ఫలితంగా చివరిదైన మూడో సింగిల్స్ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆ మ్యాచ్‌లో హన్స్ క్రిస్టియన్ విటింగస్ 21-15, 21-7 ఆధిక్యంతో ఇషాన్ వౌలానా ముస్త్ఫాపై సునాయాసంగా విజయం సాధించి డెన్మార్క్‌కు థామస్ కప్‌ను అందించాడు. కాగా, సెమీస్‌లో ఓడిన దక్షిణ కొరియా, మలేషియా జట్లకు కాంస్య పతకాలు దక్కాయి.
చైనాకు ఉబెర్ కప్
మహిళల విభాగంలో జరిగిన ఉబెర్ కప్‌లో చైనా 14వ సారి విజేతగా నిలిచింది. ఫైనల్‌లో ఈ జట్టు దక్షిణ కొరియాను 3-1 తేడాతో ఓడించింది. సింగిల్స్ విభాగంలో జరిగిన తొలి మ్యాచ్‌లో లీ జురుయ్ 21-14, 13-21, 21-10 తేడాతో సంగ్ జీ హ్యున్‌ను ఓడించింది. ఆ వెంటనే జరిగిన డబుల్స్‌లో కొరియా జోడీ జంగ్ యుంగ్ ఎమ్, షిన్ సుయెంగ్ చాన్ 16-21, 21-17, 25-23 స్కోరుతో తియాన్ క్విన్, జావో యున్‌లెయ్ జోడీపై అతి కష్టం మీద గెలిచింది. దీనితో ఇరు జట్ల స్కోరు సమమయ్యాయి. రెండు సింగిల్స్‌లో చైనా క్రీడాకారిణి వాంగ్ షిజియాన్ 21-13, 21-12 స్కోరుతో కిమ్ హ్యువో మిన్‌పై గెలిచి చైనాకు 2-1 ఆధిక్యాన్ని అందించింది. అనంతరం డబుల్స్ మ్యాచ్‌లో తాంగ్ యూంటింగ్, చెన్ క్వింగ్ చెన్ జోడీ 21-14, 21-16 ఆధిక్యంతో చాన్ యెనా, లీ సో హీ జోడీపై గెలిచి చైనాకు తిరుగులేని 3-1 ఆధిక్యాన్ని సంపాదించిపెట్టింది. దీనితో వాంగ్ ఇహాన్, లీ జాంగ్ మీ మధ్య జరగాల్సిన చివరి సింగిల్స్ మ్యాచ్ ఆడాల్సిన అవసరం లేకపోయింది. కాగా, సెమీ ఫైనల్‌లో ఓడిన భారత్, జపాన్ జట్లు కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాయి.

కీలక మ్యాచ్‌లో గెలిచి డెన్మార్క్‌కు తొలి థామస్ కప్ టైటిల్‌ను అందించిన హన్స్ క్రిస్టియన్ విటింగస్