క్రీడాభూమి

గేల్ గెలిచాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, జూలై 16: వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ క్రిస్ గేల్ ప్రపంచ కప్ క్రికెట్ చాంపియన్‌షిప్‌లో విఫలమైనప్పటికీ, కోర్టులో మాత్రం గెలిచాడు. మసాజ్ చేయడానికి వచ్చిన ఒక మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ, వరుస కథనాలను ప్రచురించిన ఫెయిర్ ఫాక్స్ మీడియా సంస్థపై అతను వేసిన పరువునష్టం దావాకు అనుకూలంగా ఇది వరకే కోర్టు తీర్పునిచ్చింది. అయితే, ఈ కేసును కొట్టివేయాల్సిందిగా కోరుతూ ఫెయిర్ ఫాక్స్ సంస్థ సిడ్నీ కోర్టును ఆశ్రయించింది. 3,00,000 ఆస్ట్రేలియా డాలర్లు (2,11,000 యూఎస్ డాలర్లు) విలువ చేసే నష్టపరిహారం కేసులో మీడియా సంస్థ తరఫు లాయర్లు తగిన ఆధారాలను చూలేకపోయారని కోర్టు అభిప్రాయపడింది. వివరాల్లోకి వెళితే, 2015 ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా సిడ్నీలో మ్యాచ్ ఆడేందుకు విండీస్ జట్టుతో వచ్చిన గేల్ డ్రెస్సింగ్ రూమ్‌లో మసాజ్ చేసేందుకు వచ్చిన మహిళకు మర్మాంగాన్ని చూపిస్తూ అసభ్యంగా ప్రవర్తించాడని అప్పట్లో ‘ది సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్’, ‘ది ఏజ్’ పత్రికలను ప్రచురించిన ఫెయిర్ ఫాక్స్ గ్రూప్ మీడియా ఆరోపించింది. 2016లో వరుస కథనాలను కూడా ప్రచురించింది. దీనితో గేల్ పరువునష్టం దావా వేశాడు. తన ప్రతిష్టను దెబ్బతీయడానికే ఈ వరుస కథనాలను ప్రచురించిందంటూ ఆరోపించాడు. న్యూ సౌత్‌వేల్స్ కోర్టు ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది. ఒక మహిళా మసాజర్ పట్ల గేల్ అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేస్తూ కేసును కొట్టేసింది. ఈ తీర్పుపై ఫెయిర్ ఫాక్స్ సంస్థ సిడ్నీ కోర్టులో అప్పీల్ చేసింది. నష్టపరిహారం దావాను కొట్టేయాల్సిందిగా కోరింది. కానీ, ఆ సంస్థకు అక్కడ కూడా చుక్కెదురైంది. సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా ఫెయిర్ ఫాక్స్ కేసును కొట్టేస్తూ సిడ్నీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.