క్రీడాభూమి

ఆరు పదుల లోపే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 16: టీమిండియా హెడ్ కోచ్‌గా దరఖాస్తు చేసుకునే వారు 60 ఏళ్ల లోపువారై ఉండాలని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) స్పష్టం చేసింది. కోచ్, సపోర్టింగ్ స్ట్ఫా కోసం మంగళవారం ఒక ప్రకటనను విడుదల చేసింది. హెడ్ కోచ్ వయసు 60సంవత్సరాలు మించకూడదని, అంతర్జాతీయ క్రికెట్‌లో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలని ఆ ప్రకటనలో తెలిపింది. హెడ్ కోచ్, బ్యాటింగ్ కోచ్, బౌలింగ్ కోచ్, ఫీల్డింగ్ కోచ్, ఫిజియోథెరపిస్ట్, కండీషనింగ్ కోచ్, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ పోస్టులను బీసీసీఐ భర్తీ చేయనుంది. ఆసక్తిగల వారు ఈనెల 30వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా అందేలా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. 2017 జూలై మాసంలో రవి శాస్ర్తీని హెడ్ కోచ్‌గా ఎంపిక చేసినప్పుడు తొమ్మిది సూత్రాలతో అర్హతను ప్రకటించింది. అయితే, ఆ ప్రక్రియలో స్పష్టత లేకపోవడంతో, అప్పట్లో రవి శాస్ర్తీ ఎంపికపై దుమారం చెలరేగింది. అలాంటి సమస్యలు తలెత్తకుండా చూసేందుకు బీసీసీఐ ఇప్పుడు మూడు అంశాలను ఖాయం చేసింది. ప్రస్తుత హెడ్ కోచ్‌తోపాటు బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్ కోచ్, ఇతర సపోర్టింగ్ స్ట్ఫా పేర్లను ఎలాంటి ప్రత్యేక దరఖాస్తు లేకపోయినా పరిగణలోకి తీసుకుంటామని బీసీసీఐ తెలిపింది. హెడ్ కోచ్‌గా దరఖాస్తు చేసుకునే వారికి, టెస్టు హోదా ఉన్న ఏదైనా జట్టుకు కనీసం రెండేళ్లు కోచ్‌గా వ్యవహరించి ఉండాలని లేదా ఐసీసీ అసోసియేట్ జట్టుకు/ ‘ఏ’ జట్టుకు/ ఐపీఎల్ జట్టుకు కనీసం మూడేళ్లపాటు కోచింగ్ ఇచ్చి ఉండాలని బీసీసీఐ తన ప్రకటనలో వివరించింది. అంతేగాక, అభ్యర్థికి 30 టెస్టులు లేదా 50 వనే్డ ఇంటర్నేషనల్స్ ఆడిన అనుభవం ఉండాలని షరతు విధించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్‌లకు కూడా ఇవే షరతులు వర్తిస్తాయి. అయితే, ఆడిన మ్యాచ్‌ల సంఖ్యలో కొంత వెసులుబాటును ఇచ్చింది. ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే వారికి కనీసం 10 టెస్టులు లేదా 25 వనే్డ ఇంటర్నేషనల్స్ ఆడిన అనుభవం ఉండాలని తెలిపింది. వీరిలో ఎవరికీ వయసు 60 సంవత్సరాలు దాటి ఉండకూడదని పేర్కొంది. రవి శాస్ర్తీ వయసు 57 ఏళ్లు కాబట్టి, అతనికే హెడ్ కోచ్‌గా ప్రాధాన్యం ఇస్తారని అంటున్నారు.