క్రీడాభూమి

సన్‌రైజర్స్ కొత్త కోచ్ బేలిస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 18: ఐపీఎల్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ కొత్త కోచ్‌గా ట్రెవర్ బేలిస్ సేవలు అందించనున్నాడు. ప్రపంచ కప్ క్రికెట్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను అందుకున్న ఇంగ్లాండ్‌కు కోచ్‌గా వ్యవహరించిన బేలిస్‌ను టామ్ మూడీ స్థానంలో సన్‌రైజర్స్ కోచ్‌గా నియమించారు. వచ్చేవారం ఆస్ట్రేలియాతో జరిగే ప్రతిష్టాత్మకమైన యాషెస్ సిరీస్ తర్వాత, ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డుతో బేలిస్ ఒప్పందం ముగుస్తుంది. ఆ తర్వాత అతను సన్‌రైజర్స్‌కు కోచ్‌గా బాధ్యతలు తీసుకుంటాడు. గత ఏడేళ్లుగా కోచ్‌గా వ్యవహరిస్తున్న ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ మూడీ మార్గదర్శకంలోనే 2016లో సన్‌రైజర్స్ జట్టు ఐపీఎల్ టైటిల్‌ను దక్కించుకుంది. కాగా, బేలిస్ కోచ్‌గా వ్యవహరించనప్పుడు కోల్‌కతా నైట్ రైడర్స్ రెండు పర్యాయాలు ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంది. అదే విధంగా అతను కోచ్‌గా ఉన్న సిడ్నీ సిక్సర్స్ జట్టు బిగ్ బాష్ లీగ్ విజేతగా నిలిచింది. తాజాగా ఇంగ్లాండ్ జట్టు ప్రపంచ కప్‌ను సాధించింది. సమర్థుడైన కోచ్‌గా బేలిస్ తనను తాను నిరూపించుకున్నాడని, అతని మార్గదర్శకం ఆటగాళ్లకు ఎంతో అవసరమని సన్‌రైజర్స్ గురువారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. అతని నుంచి ఎంతో నేర్చుకుంటా రన్న ధీమా వ్యక్తం చేసింది.