క్రీడాభూమి

టీనేజర్ ప్రీతూ గుప్తాకు గ్రాండ్‌మాస్టర్ హోదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 19: ఢిల్లీకి చెందిన టీనేజర్ ప్రీతూ గుప్తా గ్రాండ్‌మాస్టర్ హోదాను సంపాదించాడు. భారత 64వ గ్రాండ్‌మాస్టర్‌గా రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు. పోర్చుగీస్ లీగ్ చెస్ చాంపియన్‌షిప్‌లో ఇంటర్నేషనల్ మాస్టర్ లెవ్ యానె్కలెవిచ్‌ను ఓడించడంతో 15 ఏళ్ల ప్రీతూ ఖాతాలో 2,500 ఎలో రేటింగ్ పాయింట్లు చేరాయి. అతనికి గ్రాండ్‌మాస్టర్ హోదా లభించింది. తొమ్మిదేళ్ల వయసులో చెస్ ఆటపై దృష్టి పెట్టిన ప్రీతూ అతి కొద్దికాలంలోనే అత్యున్నత స్థానానికి చేరుకున్నాడు. సంచలన విజయాలతో అందరినీ ఆకట్టుకున్నాడు. 15 సంవత్సరాల 4 నెలల, 10 రోజుల వయసులో అతనికి ఈ హోదా లభించింది. భారత మొట్టమొదటి గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ అతి చిన్న వయసులోనే ఆ హోదాను సంపాదించిన 31 ఏళ్ల తర్వాత, అదే ఫీట్‌ను సాధించిన చెస్ ఆటగాడిగా ప్రీతూ గుర్తింపు పొందాడు. ఎలో రేటింగ్ పాయింట్లు 2,500లకు చేరుకోవడంతో, గ్రాండ్‌మాస్టర్ హోదా లభించినందుకు తాను ఎంతో సంతోషిస్తున్నానని ప్రీతూ తెలిపాడు. విశ్వనాథన్ ఆనంద్‌ను స్ఫూర్తిగా తీసుకొని తాను ముందుకు వెళుతున్నానని తెలిపాడు. ఇలావుంటే, ప్రపంచంలోనే అత్యంత పిన్న వయసులో గ్రాండ్‌మాస్టర్ హోదాను సాధించిన చెస్ ఆటగాడిగా తమిళనాడుకు చెందిన డీ. గుకేష్ ఈ ఏడాది జనవరిలో రికార్డు నెలకొల్పాడు. అతను గ్రాండ్‌మాస్టర్ హోదాను సంపాదించే సమయానికి అతని వయసు 12 సంవత్సరాల, ఏడు నెలల, 17 రోజులు.