క్రీడాభూమి

ఓవర్ త్రోపై ఎంసీసీ సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 20: నిన్న, మొన్నటివరకు పెద్దగా ప్రచారంలో లేని ఓవర్ త్రో ఇటీవల జరిగిన ప్రపంచకప్ ఫైనల్‌తో తెరమీదికొచ్చిం ది. ఈ ఓవర్ త్రో ద్వారా ఒక జట్టు ప్రపంచకప్ గెలుచుకోగా, మరో జట్టు కోల్పోయంది. దీంతో ఓవర్ త్రో నిబంధనను మార్చాలనే నిర్ణయాన్ని అన్ని జట్లు సోషల్ మీడియా వేదికగా కోరిన విషయం తెలిసిందే. అయితే తాజాగా లండన్‌కు చెందిన ‘ది సండే టైమ్స్’ ఓ కథనాన్ని ప్రచురించింది. ప్రపంచ కప్ ఫైనల్‌లో చోటుచేసుకున్న ఓవర్ త్రో నిబంధనపై మరిల్‌బోన్ క్రికెట్‌క్లబ్ (ఎంసీసీ) సమీక్ష జరిపే యోచనలో ఉన్నట్లు పేర్కొంది. ఇంగ్లాండ్- న్యూజిలాండ్ మధ్య జరిగిన ప్రపంచకప్ ఫైనల్‌లో చివరి ఓవర్‌లో అనూహ్యంగా ఓవర్ త్రో ద్వారా లభించిన పరుగులు మ్యాచ్ ఫలితాన్ని మార్చేశాయ. దీంతో ఈ నిబంధనపై సమీక్ష జరిపి అవసరమైతే మార్చాలని క్రికెట్ నిబంధనలు రూపొందించే ఎంసీసీ సమ్ కమిటీ భావిస్తున్నట్లు దిసండే టైమ్స్ వెల్లడించింది.