క్రీడాభూమి

నో రిటైర్డ్‌మెంట్..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 20: వచ్చే నెల 3 నుంచి వెస్టిండీస్ జట్టు తో ప్రారంభమయ్యే అన్ని సిరీస్‌లకు భారత మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనీ దూరమయ్యాడు. ముం దుగా తీసుకున్న నిర్ణయం ప్రకారం రెండు నెలల పాటు ధోనీ పారా మిలటరీ రెజిమెంట్‌లో సేవలు చేసేందుకు సిద్ధమవుతున్నాడు. పారచూట్ రెజిమెంట్‌లో ధోనీ గౌరవ లెఫ్టినెంట్ కల్నల్‌గా పనిచేస్తున్న విషయం తెలిసిందే. దీంతో మిస్టర్ కూల్ ఇంకా కొన్నాళ్లు క్రికెట్ ఆడనున్నట్లు స్పష్ట చేసి నట్లయింది. ఈ విషయాన్ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కి చెందిన అధికారి ఒకరు స్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతూ ధోనీ తీసుకున్న నిర్ణయాన్ని కెప్టెన్ విరాట్ కో హ్లీతో పాటు సెలక్షన్ కమిటీ తెలిపినట్లు చెప్పాడు. అయతే ధోనీ రిటైర్డ్‌మెంట్‌పై ఇటు సెలక్షన్ కమిటీ, అటు ధోనీ మాట్లాడకపోవడం విశేషం. మరోవైపు విండీస్ టూర్‌కు వెళ్లే జట్టును సెలక్షన్ కమిటీ ఆదివారం ప్రకటించనుంది.
పంత్.. సాహా..?
మహేంద్రసింగ్ ధోనీ కరేబియాన్ టూర్ నుంచి తప్పుకోవడంతో ఆ స్థానంలో యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌ను తీసుకోనున్నట్లు సమాచారం. అయతే టెస్టుల్లో మాత్రం గాయం నుంచి కోలుకున్న సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాను తీసుకుంటారా? లేదా అనేది అనుమానంగా ఉంది. వీరిద్దరితో పాటు భారత్ ఏ జట్టుకు చెందిన కేఎస్ భరత్ పేరు కూడా వినబడుతోంది. భరత్ ఇటీవల భారత్ ఏ తరఫున అద్భుతంగా రాణిస్తున్నాడు. గత 11 మ్యాచుల్లో మూడు సెంచరీలతో పాటు రెండు అర్ధ సెంచరీలు సాధించి 686 పరగులకు పైగా స్కోరు సాధించాడు. అంతేకాకుండా వికెట్ కీపర్‌గా 41 క్యాచ్‌లు, 6 స్టంప్ అవుట్‌లు చేశాడు.

చిత్రం...మహేంద్రసింగ్ ధోనీ