క్రీడాభూమి

అదరగొట్టిన కుర్రాళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంటిగ్వా, జూలై 22: కరేబియాన్ గడ్డపై భారత కుర్రా ళ్లు అదరగొట్టారు. అనధికారికంగా జరిగిన 5 మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌ను 4-1 కైవసం చేసుకున్నారు. ఆదివారం రాత్రి జరిగిన చివరి మ్యాచులో వెస్టిండీస్ ఏ జట్టు నిర్దేశించిన 236 పరుగుల లక్ష్యాన్ని 17 ఓవర్లు మిగిలి ఉండగానే కేవ లం 2 వికెట్లు మాత్రమే కోల్పోయ విజయం సాధించింది.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్ జట్టులో ఓపెనర్ సునీల్ అంబ్రిస్ (61), షెర్ఫానె రూథర్‌ఫర్డ్ (65) అర్ధ సెంచరీలతో రాణించగా, చివర్లో ఖారీ ప్లెరీ (35, నాటౌట్) ఫర్వాలేదనిపించడంతో వెస్టిండీస్ ఏ జట్టు 47.4 ఓవర్లలో 236 పరుగులకు కుప్పకూలింది. భారత్ ఏ బౌలర్లలో దీపక్ చాహర్, రాహుల్ చాహర్, నవదీప్ సైనీ తలా రెండేసి వికెట్లు తీయగా, ఖలీల్ అహమ్మద్, కృనాల్ పాండ్యా, అక్షర్ పటేల్ ఒక్కో వికెట్ తీసుకున్నారు. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన భారత్ ఏ జట్టులో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (99) త్రుటిలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకోగా, శుభ్‌మన్ గిల్ (69) పరుగులు చేసి పెవిలియన్‌కు చేరారు. అంతకుముందు వీరిద్దరూ కలిసి మొదటి వికెట్‌కు 110 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్ (61, నాటౌట్) కెప్టెన్ మనీష్ పాండే (7, నాటౌట్)తో కలిసి చివరి వరకు క్రీజులో ఉండి జట్టును గెలిపించారు. దీంతో భారత్ ఏ జట్టు ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌ను 4-1తో గెలుచుకుంది. విండీస్ బౌలర్లలో రఖీమ్ కార్న్‌వాల్, రోస్టన్ ఛేస్ చెరో వికెట్ తీసుకున్నారు.
కలిసొచ్చే అదృష్టం..
విండీస్ గడ్డపై భారత్ ఏ జట్టు సిరీస్ సాధించడం ఆట గాళ్లకు కలిసొచ్చే అంశం. వచ్చే నెల 3 నుంచి భారత జట్టు విండీస్ పర్యటన ఖరారైన నేపథ్యంలో భారత్ ఏ జట్టు నుంచి పలువురు ఆటగాళ్లు జాతీయ జట్టుకు ఎంపికైన విష యం తెలిసిందే. ఇందులో కృనాల్ పాండ్యా, రాహుల్, చా హర్, దీపక్ చాహర్, నవదీప్ సైనీలు టీ20 జట్టుకు ఎంపిక కాగా, శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, ఖలీల్ అహ్మద్ లు టీ20, వనే్డ జట్లకు తమ పేరును ఖరారు చేసుకున్నారు.