క్రీడాభూమి

నాలుగు ఎవరిది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 22: భారత క్రికెట్ జట్టును నాలుగో స్థానం వేధిస్తోంది. కొన్నాళ్లుగా ఈ స్థానంలో ఎవరిని ఆడించాలో తెలి యక సెలక్టర్లు తలలు పట్టుకుంటున్నారు. ప్రపంచకప్ ముందు హైదరాబాద్ ఆటగాడు అంబటి రాయుడు, తమిళనాడు ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ ను ప్రయోగత్మకంగా ఆడించినా వారు విఫలం కావడంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. పైగా అంబటి రాయుడు అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవడం, విజయ్‌శంకర్‌ను ప్రపంచకప్‌కు ఎంపిక చేసినా ఆకట్టుకోలేక పోవడంతో రానున్న విండీస్ పర్యటనలో నాలుగో స్థానం లో ఎవరిని బరిలోకి దింపనున్నారోనని తెలియాల్సి ఉంది.
రాహులేనా..?
సమస్యగా మారిన నెంబర్ 4 స్థానంలో కేఎల్ రాహుల్‌ని ఆడిస్తే బాగుంటుందని పలువురు మాజీలతో పాటు క్రికెట్ ప్రేమికులు కోరుకుంటున్నారు. ప్రపంచకప్ టోర్నీలో రెగ్యూ లర్ ఓపెనర్ శిఖర్ ధావన్ గాయం కారణంగా దూరమవడంతో రాహుల్ ఓపెనర్‌గా రోహి త్ శర్మతో కలిసి ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం విండీస్ టూర్‌లో వీరిద్దరూ ఉండడంతో ఓపెనర్లుగా రోహిత్, ధావన్ వస్తే, మూడో స్థానంలో ఎప్పటిలాగే కెప్టెన్ వి రాట్ కోహ్లీ రానుండగా నాలుగో స్థానం రాహుల్‌కి పరిమితం చేస్తే బాగుంటుందనే వార్తలు వినిపిస్తున్నాయ. పైగా రాహుల్‌కు ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేసే సత్తా ఉంది. రాహుల్ తర్వాత రిషభ్ పంత్‌తో టాప్ ఆర్డర్ బలంగా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయతే ఓపెనర్లలో ఎవరైనా గాయపడితే రాహుల్ ఓపెనింగ్ స్థానంలో రావాల్సి ఉండ డంతో సెలక్టర్లు రాహుల్‌ను ఆ స్థానంలో ఆడించడంపై ఆలో చనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
శ్రేయాస్, మనీష్ అందుకేనా..?
ఒకవేళ రాహుల్‌ని నాలుగో స్థానంలో ఆడించకపోతే ఆ స్థానంలో యువ ఆటగాళ్లు శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండేలను ఆడించే అవకాశముంది. అందుకే వీరిని వెస్టిండీస్ పర్యటనకు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల వీరిద్దరూ ఐపీఎల్‌తో పాటు వెస్టిండీస్ ఏ జట్టుతో జరిగిన సిరీస్‌లోనూ అద్భుతంగా రాణించారు. వీరిలో ఎవరినైనా నాలుగో స్థానంలో ఆడి రాణిస్తే మాత్రం తమిళనాడు ఆల్‌రౌండర్ విజయ్‌శంకర్‌కు జాతీయ జట్టులో చోటు కష్టమనే చెప్పాలి. ఈ మధ్య జరిగిన సెలక్షన్ కమిటీ సమావేశంలోనూ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ మాట్లాడుతూ యువతకు వరుసగా అవకాశాలిస్తామనడం దీనికి నిదర్శ నమే. మరోవైపు సీనియర్ ఆటగాడు, వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ సైతం ప్రపంచకప్ టోర్నీలో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోవడంతో జాతీయ జట్టులో చోటు కోసం కుర్రాళ్లతో పోటీ ఎదుర్కొక తప్పదు. ఇంకోవైపు మహేంద్రసింగ్ ధోనీ కోసం రిషభ్ పంత్, వృద్ధిమాన్ సాహా పోటీ పడుతున్నారు. అయతే విండీస్ టూర్‌లో మాత్రం సాహాను టెస్టులకు పరిమితం చేయగా, టీ20, వనే్డల్లో రిషభ్ పంత్‌ను కొనసాగించడం విశేషం.