క్రీడాభూమి

సంచలనం సృష్టించేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 23: అంతర్జాతీయ వనే్డల్లో చిన్న జట్టుగా సంచనాలు సృష్టించిన ఐర్లాండ్ క్రికెట్ జట్టు నేడు లండన్ వేదికగా జరగనున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో విశ్వవిజేత జట్టయన ఇంగ్లాండ్‌ను ఢీకొనబోతుంది. గతేడాదే అఫ్గానిస్తాన్‌తో పాటు టెస్ట్ హోదాను అందుకున్న ఐరిష్ జట్టు ఇప్పటికీ ఆడింది రెండు టెస్టులు మాత్రమే. ఈ రెండింటిలోనూ (పాకిస్తాన్, అఫ్గానిస్తాన్) పరాజయమే చవిచూసింది. అయతే గతంలో కంటే తమ జట్టు ప్రత్యర్థి జట్లను దీటుగా ఎదుర్కొంటుందని ఐర్లాండ్ కెప్టెన్ విలియమ్ పోర్టర్‌ఫీల్డ్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు.
పెద్ద జట్లను ఓడించిన చరిత్ర
క్రికెట్‌లో ఐర్లాండ్ జట్టు ఇప్పటికీ పసికూనే అయినా వనే్డల్లో పెద్ద జట్లను ఓడించిన ఘన చరిత్రను సొంతం చేసుకుంది. అది కూడా ప్రపంచకప్‌లో కావడం విశేషం. 2007 ప్రపంచకప్ గ్రూప్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాక్ జట్టును 45.4 ఓవర్లలో నే కేవలం 132 పరుగులకే కుప్పకూల్చింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనలో 3 వికెట్లు మిగిలి ఉండగానే విజయం సాధించి, ఈ మెగా టోర్నీలో మొదటి సారి పాకిస్తాన్ జట్టుకు షాక్‌నిచ్చింది.
ఇంగ్లాండ్‌కూ తప్పలేదు..
2011 ప్రపంచకప్‌లో ఇదే ఐర్లాండ్ జట్టు ప్రస్తుతం విశ్వవిజేతగా అవతరించిన ఇంగ్లాండ్ జట్టును మట్టికరిపించింది. బెంగళూరు వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయ 327 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్ష్యం పెద్దదైనా ఐర్లాండ్ ఆటగాళ్లు ఏమాత్రం బెరుకు లేకుండా ఆడారు. ఇంగ్లీష్ బౌలర్లను చిత్తుచేస్తూ మరో 5 బంతులు మిగిలి ఉండగానే 3 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ప్రత్యర్థి జట్లకు వెన్నులో వణుకు పుట్టించారు.
బోణీకొట్టాలనే కసితో..
ఇప్పటివరకు ఆడిన రెండు టెస్టుల్లో పరాజ యం పొందిన ఐరిష్ జట్టు, ప్రతిష్టాత్మకమైన లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్ జట్టును ఓడించి తొలి విజయాన్ని అందుకోవాలని ఉవ్విళ్లూరు తోంది. జట్టులో కెప్టెన్ విలియమ్ పోర్టర్‌ఫీల్డ్‌తో పాటు ఆల్‌రౌండర్లు కెవిన్ ఒబ్రెయన్, పాల్ స్టిర్లింగ్, స్టువర్ట్ థాంప్సన్ మంచి ఫాంలో ఉండగా, బౌలింగ్ విభాగంలో మార్క్ అదైర్, అండీ మెక్‌బ్రైన్, బైడ్ రాంకిన్, క్రెయగ్ యంగ్ వంటి ప్రతిభ గల ఆటగాళ్లపైనే ఐర్లాండ్ జట్టు నమ్మకం పెట్టుకుంది.
రెట్టించిన ఉత్సాహంతో ఇంగ్లాండ్
మరోవైపు ఇంగ్లాండ్ జట్టు సొంత గడ్డపై, ఇదే మైదానంలో వారం రోజుల క్రితం ప్రపంచకప్ గెలిచిన ఉత్సాహంతో బరిలోకి దిగనుంది. అయతే ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ దగ్గర పడుతుండడంతో ఇంగ్లీష్ జట్టుకు గెలుపు తప్పనిసరైంది. చిన్న జట్టేనని ఏమాత్రం అజాగ్రత్త వహించినా 2011 ప్రపంచకప్ టోర్నీలో జరిగిన పరాభవమే మిగలనుంది.

చిత్రం...లార్డ్స్ మైదానంలో మంగళవారం జరిగిన నెట్ ప్రాక్టీస్ సెషన్‌లో
ఇంగ్లాండ్ ఆటగాళ్లు రోరీ బర్న్స్, జో రూట్