క్రీడాభూమి

ధోనీ కెప్టెన్సీ పదిలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 23: పరిమిత ఓవర్ల విభాగంలో టీమిండియాకు నాయకత్వ బాధ్యతల నుంచి మహేంద్ర సింగ్ ధోనీని తప్పించి, అసాధారణ ఫామ్‌ను కొనసాగిస్తున్న టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఆ విభాగాన్ని కూడా అప్ప చెప్తారన్న ఊహాగానాలకు జాతీయ సెలక్టర్లు తెరదించారు. జింబాబ్వేలో వచ్చేనెల 11 నుంచి 20వ తేదీ వరకు జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌కు జాతీయ సెలక్టర్లు ధోనీనే కెప్టెన్‌గా ఎంపిక చేశారు. సందీప్ పాటిల్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సోమవారం సమావేశమై జింబాబ్వే టూర్‌తోపాటు వెస్టిండీస్‌లో పర్యటించే జట్టును కూడా ఎంపిక చేసింది. అక్కడ టెస్టు సిరీస్ ఆడే జట్టుకు విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉంటాడు. జింబాబ్వే టూర్ నుంచి కోహ్లీతోపాటు మురళీ విజయ్, ఆశిష్ నెహ్రాకు సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. ఎవరూ ప్రత్యేకంగా విశ్రాంతి కావాలని కోరలేదని, అయితే, అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని ఆదివారం జరిగిన భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ప్రత్యేక వార్షిక సమావేశంలో కార్యదర్శిగా ఎన్నికైన అజయ్‌ఛ షిర్కే తెలిపాడు. సెలక్షన్ కమిటీ సమావేశంలో పాల్గొన్న అతను జింబాబ్వే, వెస్టిండీస్ టూర్లకు జట్లను ఎంపిక చేసిన తర్వాత విలేఖరులతో మాట్లాడుతూ యువ ఆటగాళ్లకు ప్రాధాన్యతనిచ్చిట్టు తెలిపాడు.
శార్దూల్‌కు స్థానం
టెస్టు జట్టులో ఎవరూ ఊహించని విధంగా శార్దూల్ ఠాకూర్‌కు సెలక్టర్లు స్థానం కల్పించారు. ముంబయికి చెందిన ఈ 24 ఏళ్ల మీడియం పేసర్ దేశవాళీ పోటీల్లో నిలకడగా రాణించి, సెలక్టర్లను ఆకర్షించాడు. ముంబయి తరఫున 11 మ్యాచ్‌లు ఆడి 41 వికెట్లు పడగొట్టి, 17 మందితో కూడిన టెస్టు జట్టులో అతను చోటు దక్కించుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో ఆడిన భారత టెస్టు జట్టులో సభ్యుడిగా ఉన్న వరుణ్ ఆరోన్‌కు సెలక్టర్లు ఉద్వాసన పలికారు. ఫిట్నెస్ సమస్యల నుంచి బయటపడిన మహమ్మద్ షమీకి అవకాశం కల్పించేందుకు ఆరోన్‌పై వేటు వేశారు. ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్నీ తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. మొత్తం మీద ఈ జట్టులో ఎక్కువ మంది యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించారు. విదర్భకు చెందిన ఎడమచేతి వాటం ఓపెనర్ ఫైజ్ ఫజల్, ఆఫ్ స్పిన్నర్ జయంత్ యాదవ్, పంజాబ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ మన్దీప్ సింగ్, ఐపిఎల్‌లో ఇప్పటి వరకూ అత్యధిక వికెట్లు పడగొట్టిన యజువేంద్ర చాహల్ తదితరులు టెస్టు జట్టులోకి వచ్చారు.
వెటరన్లకు నిరాశే
వెస్టిండీస్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో స్థానం లభిస్తుందని ఆశించిన హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్, గౌతం గంభీర్ వంటి వెటరన్లకు నిరాశే ఎదురైంది. జూలై రెండో వారంలో జరిగే అవకాశాలున్న ఈ సిరీస్‌కు కోహ్లీ నాయకత్వం వహిస్తాడు. ఒకరిద్దరు ఆటగాళ్లను మినహాయిస్తే టెస్టు జట్టులో పెద్దగా మార్పులు జరగలేదు. కోహ్లీకి సహాయకుడిగా ఆజింక్య రహానే వ్యవహరిస్తాడు.
జింబాబ్వే (టెస్టు సిరీస్) టూర్‌కు టీమిండియా
మహేంధ్ర సింగ్ ధోనీ (కెప్టెన్), లోకేష్ రాహుల్, మనీష్ పాండే, కరుణ్ నాయర్, అంబటి రాయుడు, రిషీ ధావన్, అక్షర్ పటేల్, జయంత్ యాదవ్, ధవళ్ కులకర్ణి, జస్‌ప్రీత్ బుమ్రా, బరీందర్ శరణ్, మన్దీప్ సింగ్, జైదేవ్ ఉనాద్కత్, యజువేంద్ర చాహల్. ఫైజ్ ఫజల్.
విండీస్ (పరిమిత ఓవర్ల సిరీస్) టూర్‌కు భారత జట్టు
విరాట్ కోహ్లీ (కెప్టెన్), ఆజింక్య రహానే (వైస్-కెప్టెన్), మురళీ విజయ్, శిఖర్ ధావన్, లోకేష్ రాహుల్, చటేశ్వర్ పుజారా, రోహిత్ శర్మ, వృద్ధిమాన్ సాహా, రవిచంద్రన్ అశ్విన్, అమిత్ మిశ్రా, రవీంద్ర జడేజా, ఇశాంత్ శర్మ, మహమ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్, శార్దూల్ ఠాకూర్, స్టువర్ట్ బిన్నీ.