క్రీడాభూమి

ఎప్పటికైనా టీమిండియాకు కోచ్ అవుతా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, ఆగస్టు 2: తను ఎప్పటికైనా భారత జట్టు కోచ్ అవుతానని టీమిండియా మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు. ఓవైపు భారత క్రికెట్ ప్రధాన కోచ్‌తో పాటు సపోర్టింగ్ స్టాఫ్‌ల నియామకానికి బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించిన విషయం తెలిసిందే. దీనికి భారత జట్టు మాజీ ఆటగాళ్లతో పాటు విదేశీ జట్ల మాజీలు కూడా దరఖాస్తు చేసుకో గా, వీరిలో ప్రధాన కోచ్‌గా రవిశాస్ర్తీతో పాటు ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు టామ్ మూడీతో పాటు న్యూజిలాండ్ మా జీ కోచ్ మైక్ హస్సెన్‌లు రేసులో ముందు వరుసలో ఉన్నా రు. ఇక భారత్ నుంచి రాబిన్ సింగ్, లాల్‌చంద్ రాజ్‌పుత్ సైతం కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే.
ఇది తగిన సమయం కాదు..
కోచ్ పదవి చేపట్టాలని ఉన్నా ఇది తగిన సమయం కాదని, మరోసారి త ప్పకుండా పోటీలో ఉంటానని గంగూ లీ స్పష్టం చేశాడు. ఈ సందర్భంగా దా దా మాట్లాడుతూ ‘నాకు టీమిండియా కోచ్‌గా చేయలని ఆసక్తిగా ఉంది. ఇప్పు డు తగిన సమయం కాదు. ప్రస్తుతం నేను చాలా బిజీగా ఉన్నా. భవిష్యత్తు లో నేను కూడా కోచ్ పదవికి దరఖాస్తు చేస్తా అని గంగూలీ పేర్కొన్నాడు. గత కొంతకాలంగా ఐపీఎల్, క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్), టీవీ కామెంటరీ చేస్తూ బిజీగా ఉన్నా. వీటిన్నింటినీ పూర్తి చేసిన తర్వాత నేను కూడా రేసులోకి వస్తా. ఏదో సమయంలో భారత క్రికెట్ కోచ్ పదవిని స్వీకరిస్తా’ అని గంగూలీ తెలిపాడు.