క్రీడాభూమి

కరేబియన్లపై కోహ్లీసేన పైచేయ సాధించేనా?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాడేర్హిల్, ఆగస్టు 2: ప్రపంచకప్ తర్వాత టీమిండియా నేడు వెస్టిండీస్‌తో మొదటి సిరీస్ లో తలపడనుంది. శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే టీ20 సిరీస్‌లో భారత్ కరేబియన్లపై పైచేయ సాధించాలని భావిస్తోంది. మెగా టోర్నీలో సెమీస్‌తోనే ఇంటిబాట పట్టిన కోహ్లీసేన స్వదేశంలో పలు విమర్మలు ఎదు ర్కొంది. దీంతో పాటు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మతో దూరం పెరగ డంతో కోహ్లీకి విండీస్‌తో సిరీస్ సవాల్‌గా మారింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మొదటి రెండు మ్యాచులను ఫ్లోరిడా వేదికగా జరగనున్నాయ. చివరి మ్యాచ్ మాత్రం విండీస్ లోని గయానాలో జరగనుంది. ఈ సిరీస్‌కు ముందు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకుంటాడని బీసీసీఐ అధికారికంగా ప్రకటించినా, కోహ్లీ మాత్రం విండీస్ పర్యటనలో ఆడేందుకే మొగ్గు చూపాడు. అయతే మెగా టోర్నీలో ఓటమి నుంచి బయ టపడేందుకే విరాట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు మేనేజ్‌మెంట్ ప్రకటించింది.
అటు ధోనీ.. ఇటు గేల్
ఇదిలాఉంటే విండీస్ పర్యటనలో టీమిండియా మాజీ కెప్టె న్, ధనాధన్ ధోనీ దూరమ య్యాడు. భారత ఆర్మీలో సేవలం దించేందుకు రెండు నెలల పాటు జట్టుకు దూరమయ్యాడు. అయతే మెగా టోర్నీలో దారుణంగా విఫలమైన మహేంద్రసింగ్ ధోనీ విండీస్ పర్యటనకు ముందు రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అంతా ఊహించినా, అలాంటి నిర్ణయం ధోనీకి లేదని స్పష్ట మైంది. మరోవైపు గతంలోనే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన వెస్టిండీస్ స్టార్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ మనసు మార్చు కొని భారత్‌తో సిరీస్ తర్వాత రిటైర్మెంట్ చెబుతానని పేర్కొన్నా డు. ప్రస్తుతం కెనడా లీగ్ ఆడుతున్న గేల్ భారత్‌తో జరిగే టీ20 సిరీస్‌కు దూరమ య్యాడు. అటు ధోనీ, ఇటు గేల్ దూరమ వడంతో అభిమానుల్లో కాస్త నిరాశ వ్యక్తమవుతోంది.
దూకుడే వారి బలం..
టీ20 సిరీస్ అంటేనే రెచ్చిపోయే కరేబియన్ జట్టును భార త్ నిలువరిస్తుందా అనేది చూడాలి. విండీస్ జట్టులో క్రిస్ గేల్ లేకపోయనా అండ్రూ రస్సెల్, కీరన్ పొలార్డ్, సునీల్ నరై న్, కార్లోస్ బ్రాత్ వైట్ వంటి వారితో టీమిండియాకు ప్రమాద ముంది. టెస్టుల్లోనే టీ20లా ఆడే విండీస్‌కు దూకుడే వారి బ లంగా మారనుంది. మరోవైపు జట్టు జూనియర్, సీనియర్ ఆట గాళ్లతో సమతూకంగా ఉందని కోచ్ రీఫైర్ పేర్కొన్నాడు.
‘నాలుగు’లో ఎవరూ?
ప్రపంచకప్ ముందు, తర్వాత టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌లో నాలుగో స్థానంపైనే అందరి దృష్టి పడింది. మెగా టోర్నీలోనూ మిడిలార్డర్ వైఫల్యంతోనే సెమీస్‌తోనే సరిపెట్టుకో వాల్సి వచ్చిందని మాజీలతో పాటు అభిమానుల్లోనూ నిరాశ వ్యక్తమైంది. ప్రస్తుతం జట్టులో ధోనీ లేకపోవడంతో ఆ స్థానాన్ని రిషభ్ పంత్‌తో భర్తీ చేయనున్నా, నాలుగో స్థానంలో కేఎల్ రాహుల్‌తో పాటు మనీష్‌పాండే, శ్రేయాస్ అయ్యర్‌తో పాటు పంత్ కూడా పోటీలో ఉన్నాడు. అయతే మెగా టోర్నీలో ధావన్ గాయం కారణంగా ఓపెనర్‌గా వచ్చిన రాహుల్‌తోనే ఆ స్థానాన్ని భర్తీ చేస్తే బాగుంటుందని పలువురు మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. ఇక ధావన్ కూడా గాయం నుంచి కోలుకోవ డంతో టాప్ ఆర్డర్ బలంగానే క నిపిస్తోంది. ఇక బౌలింగ్‌లో బుమ్రా లేని లోటు కనిపిస్తున్నా కొత్త కుర్రాళ్లు ఖలీల్ అహమ్మద్ తో పాటు నవదీప్ షైనీ ఆ స్థానాన్ని భర్తీ చేయనున్నారు.
జట్ల వివరాలు:
వెస్టిండీస్: జాన్ క్యాంప్‌బెల్, ఎవిన్ లూయస్, షిమ్రాన్ హి ట్మయర్, నికోలస్ పూరన్, కీరన్ పొలార్డ్, రోవ్‌మన్ పావెల్, కా ర్లోస్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), కీమో పాల్, సునీల్ నరైన్, షెల్డన్ కా ట్రెల్, ఓషనె థామస్, ఆంటోనీ బ్రాంబ్లీ, అండ్రూ రస్సెల్, కారీ పైరీ.
భారత్: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, రిషభ్ పంత్, కృనాల్ పాండ్య, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రాహుల్ చాహర్, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, దీపక్ చాహర్, నవదీప్ సైనీ.