క్రీడాభూమి

మెస్సీపై సస్పెన్షన్ వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆసన్షన్ (పరాగ్వే), ఆగస్టు 3: అర్జెంటీనా సాకర్ సూపర్ స్టార్ లోనెల్ మెస్సీపై వేటు పడింది. ఇటీవల అతను చేసిన అవినీతి ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేసిన దక్షిణ అమెరికా ఫుట్‌బాల్ సమాఖ్య (కానె్మబొల్) మూడు నెలల సస్పెన్షన్ వేటు వేసింది. అంతేగాక, 50 వేల డాలర్ల జరిమానా విధించింది. లా లిగా వంటి టోర్నీల్లో బార్సిలోనాకు ప్రాతినిథ్యం వహిస్తున్న 32 ఏళ్ల మెస్సీ మూడు నెలల వరకూ ఏ స్థాయి పోటీల్లోనూ అర్జెంటీనా జాతీయ జట్టు తరఫున ఆడేందుకు వీల్లేదని కానె్మబొల్ స్పష్టం చేసింది. బ్రెజిల్‌లో జరిగిన కోపా అమెరికా టోర్నమెంట్‌లో, మూడో స్థానం కోసం చిలీతో జరిగిన పోరులో రెండు పర్యాయాలు పెనాల్టీని రిఫరీ నిరాకరించాడు. ఈ సంఘటన మెస్సీని ఆగ్రహానికి గురి చేసింది. అంతేగాక, జూన్, జూలై ఈ టోర్నీని తమ చిరకాల ప్రత్యర్థి దేశం బ్రెజిల్‌లో నిర్వహించడాన్ని కూడా అతను తప్పుపట్టాడు. కానె్మబొల్ అధికారులు లంచాలు తీసుకొని, బ్రెజిల్‌కు ఈ టోర్నీ నిర్వాహణను అప్పచెప్పారంటూ విరుచుకుపడ్డాడు. సమాఖ్యలో అవినీతి పెచ్చరిల్లుతున్నదని అన్నాడు. రిఫరీలు కూడా అవినీతికి పాల్పడి, క్రీడాస్ఫూర్తికి విఘాతం కలిగించేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించాడు. కాగా, మెస్సీ ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన కానె్బబొల్ అతనిపై చర్య తీసుకుంది. సస్పెన్షన్, జరిమానా విధిస్తూ, మరోసారి ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటే, మరింత కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని హెచ్చరించింది.