క్రీడాభూమి

కెర్బర్‌కు చుక్కెదురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, మే 24: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో జర్మనీకి చెందిన మూడో సీడ్ క్రీడాకారిణి ఏంజెలిక్ కెర్బర్‌కు ఆదిలోనే చుక్కెదురైంది. ఆస్ట్రేలియా ఓపెన్‌లో చాంపియన్‌షిప్ సాధించిన కెర్బర్‌పై బుధవారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో అన్‌సీడెడ్ డచ్ క్రీడాకారిణి కికీ బెర్టెన్స్ (ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 58వ స్థానం) సంచలన విజయం సాధించింది. ఫిలిప్ చాట్రియర్ కోర్టులో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆరంభం నుంచే విజృంభించి ఆడిన బెర్టెన్స్ రెండుసార్లు కెర్బర్ సర్వీస్‌ను బ్రేక్‌చేసి 6-2 తేడాతో తొలి సెట్‌ను కైవసం చేసుకుంది. ఆ తర్వాత కెర్బర్ నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురవడంతో 3-6 తేడాతో రెండో సెట్‌ను కోల్పోయిన బెర్టెన్స్ మళ్లీ పవర్‌ఫుల్ షాట్లతో రెచ్చిపోయింది. ఫలితంగా 6-3 తేడాతో నిర్ణాయక మూడో సెట్‌ను కైవసం చేసుకున్న బెర్టెన్స్ రెండో రౌండ్‌కు దూసుకెళ్లడంతో కెర్బర్ ఈ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇతర మ్యాచ్‌లలో ఎనిమిదో సీడ్ తిమియా బక్సిన్‌స్కీ, తొమ్మిదో సీడ్ వీనస్ విలియమ్స్ తమతమ ప్రత్యర్థులపై విజయం సాధించగా, పురుషుల సింగిల్స్‌లో ఏడో సీడ్ థామస్ బెర్డిచ్, 13వ సీడ్ డొమినిక్ థియెమ్, 20వ సీడ్ బెర్నార్డ్ టామిక్, 21వ సీడ్ ఫెలిసియానో లోపెజ్, 21వ సీడ్ ఫ్రెడెరికో దెల్బోనిస్ తొలి రౌండ్‌ను అధిగమించారు.