క్రీడాభూమి

ఆసియా స్నూకర్ చాంపియన్‌షిప్ నాకౌట్ దశకు భారత జట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 24: అబుదాబిలో జరుగుతున్న ఆసియా టీమ్ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో భారత్ నాకౌట్ దశకు చేరుకుంది. గ్రూప్ దశలో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్‌పై 2-3 తేడాతో విజయం సాధించిన థాయిలాండ్ గ్రూప్-బిలో అగ్రస్థానానికి దూసుకెళ్లగా, భారత్ రెండో స్థానంలో నిలిచింది. అంతకుముందు శ్రీలంక, కతార్‌లతో జరిగిన లీగ్ మ్యాచ్‌లలో విజయం సాధించడంతో ఆసియా 6-రెడ్ చాంపియన్ పంకజ్ అద్వానీ సారథ్యంలోని భారత జట్టుతో పాటు ధాయిలాండ్ జట్టుకు నాకౌట్ బెర్తులు ఖరారయ్యాయి. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 0-3 తేడాతో విజయం సాధించిన భారత జట్టు ఆ తర్వాత అంతే తేడాతో కతార్ జట్టును మట్టికరిపించింది. అలాగే 2-3 తేడాతో కతార్‌పై విజయం సాధించిన థాయిలాండ్ జట్టు 3-0 తేడాతో శ్రీలంక జట్టును చిత్తు చేసింది. అయితే గ్రూప్-బిలో భారత్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో థాయిలాండ్ విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోగా, భారత్ రెండో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది.