క్రీడాభూమి

నెహ్రాకు శస్తచ్రికిత్స

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, మే 25: భారత వెటరన్ ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రాకు ఇక్కడి ఒక ప్రైవేటు ఆసుపత్రిలో జరిపిన శస్త్ర చికిత్స విజయవంతమైంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఈనెల 15న కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌తో మ్యాచ్ ఆడుతున్నప్పుడు నెహ్రా మోకాలికి తీవ్ర గాయమైంది. మందులతో తగ్గే అవకాశం లేకపోవడంతో అతనికి శస్త్ర చికిత్స అవసరమని వైద్యులు తేల్చిచెప్పారు. దీనితో అతను లండన్ ఆసుపత్రిలో శస్తచ్రికిత్స చేయించుకున్నాడు. నెహ్రాకు జరిపిన ఆపరేషన్ విజయవంతమైందని, అతనికి కనీసం రెండు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు ప్రకటించారు.
స్టోక్స్‌కు ఆపరేషన్
ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ మోకాలి గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. శ్రీలంకతో హెడింగ్లేలో జరిగిన మ్యాచ్‌లో ఆడుతున్నప్పుడు స్టోక్స్ మోకాలికి దెబ్బ తగిలింది. అతనికి శస్త్ర చికిత్స చేశామని, ప్రస్తుతం కోలుకుంటున్నాడని వైద్యులు ప్రకటించారు. ఇలావుంటే, స్టోక్స్ స్థానంలో జేక్ బాల్ జట్టులోకి రానున్నాడు. ఇంత వరకూ ఇంగ్లాండ్ జాతీయ జట్టులో స్థానం పొందలేకపోయిన బాల్‌ను శ్రీలంకతో జరిగే రెండో టెస్టుకు తీసుకునే అవకాశం ఉంది.
కాగా, ఇంగ్లాండ్‌కే చెందిన మరో ఆటగాడు రీసి టోప్లే కూడా గాయంతో బాధపడుతున్నాడు. అతను ఫిట్నెస్ సమస్యతో బాధపడుతున్న విషయాన్ని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఇసిబి) ధ్రువీకరించింది. అయితే, అతనికి రెండు వారాల విశ్రాంతి అవసరమంటూ వచ్చిన వార్తలపై స్పందించలేదు.