క్రీడాభూమి

నాలుగో స్థానంలో శ్రేయస్ కరెక్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 12: గత కొంతకాలంగా భారత జట్టును నాలు గో స్థానం వేధిస్తోంది. ఈ స్థానంలో వచ్చిన ఆటగాళ్లేవారు రాణించక పోవడంతో కీలక సమయం లో జట్టు కష్టాల్లో పడుతోంది. అయతే టీమిం డియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ మాత్రం ఈ స్థానంలో యువ ఆట గాడు శ్రేయస్ అయ్యర్‌ను ఆడిస్తే బాగుంటుందని, అతడు కచ్చితంగా సరిపోతాడని పేర్కొన్నాడు. విండీస్ పర్యటనలో భాగంగా రెండో వనే్డలో అయ్యర్ ఆటతీరు బాగుందని, దీంతో జట్టులో సుస్థిర చోటు ఏర్పరచుకుం టాడని తను భావిస్తున్నట్లు చెప్పాడు. అయతే కెప్టెన్ కోహ్లీ మాత్రం నాలుగో స్థానంలో వికెట్ కీపర్ రిషభ్ పంత్‌ను ఆడించాలని చూస్తున్నాడని, ఇది కరెక్ట్ కాదన్నాడు. పంత్ నాణ్యమైన ఆటగా డైనా, ధోనీలా మ్యాచ్ ఫినిషరేనని కొనియాడుతూనే 5 లేదా 6వ స్థానం లో పంపించాలని సూచించాడు. ఓపెనర్లు రోహిత్, శిఖర్, మూడో బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ 30-35 ఓవర్లు ఆడినా నాలుగో స్థానంలో అయ్యర్ పంపిస్తే బాగుంటుందన్నాడు. ఆ తర్వాత ఫినిషర్‌గా పంత్‌తో ధనాధన్ ఆట ఆడించొచ్చన్నాడు. ఒకవేళ టాప్ త్రీ బ్యాట్స్‌మన్స్ తొందరగానే పెవి లియన్ చేరితే, నాలుగో స్థానంలో వచ్చే రిషభ్ ఏ మేరకు రాణిస్తాడోనని అన్నాడు. విండీస్‌తో జరిగిన మూడు టీ20ల్లో నాలుగో స్థానంలో వచ్చిన రిషభ్ మొదటి రెండు మ్యాచుల్లో విఫలమవ్వగా, మూడో మ్యాచ్‌లో మాత్రం అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నా డు. అయతే రెండో వనే్డలో మాత్రం 20 పరుగులకే పరిమితమయ్యాడని పేర్కొన్నాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన శ్రేయస్ అయ్యర్ మాత్రం 71 పరుగులతో కెప్టెన్ కోహ్లీతో కలిసి సెంచరీ భాగస్వామ్యం చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడని గవాస్కర్ గుర్తుచేశాడు.

చిత్రం... శ్రేయస్ అయ్యర్‌