క్రీడాభూమి

పాక్ క్రికెటర్లకు ఐపిఎల్‌లో స్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, మే 25: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో పాకిస్తాన్ క్రికెటర్లకు కూడా అవకాశం కల్పించాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న జహీర్ అబ్బాస్ భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ)కి సూచించాడు. ఈ విధంగా చేస్తే టోర్నీ ప్రాధాన్యం, ప్రమాణాలు మరింతగా పెరుగుతాయని వ్యాఖ్యానించాడు. బుధవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఈ మాజీ పాక్ కెప్టెన్ మాట్లాడుతూ ఐపిఎల్ ఫైనల్‌ను తిలకించేందుకు రావాల్సిందిగా బిసిసిఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ నుంచి తనకు ఆహ్వానం అందిందని చెప్పాడు. ఆ మ్యాచ్ చూసేందుకు తాను బెంగళూరు వెళతానని తెలిపాడు. భారత్, పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాల పునరుద్ధరణపై చర్చలు జరిపే అవకాశం ఉంటుందని అన్నాడు. ఈ రెండు దేశాల మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్‌లు ఉత్కంఠ రేపుతాయని, ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఆసక్తిగా వీటి కోసం ఎదురుచూస్తుంటారని అన్నాడు. క్రికెట్ సిరీస్‌లను అమలు చేసే విషయంలో ప్రభుత్వ జోక్యం ఉండరాదని అభిప్రాయపడ్డాడు.