క్రీడాభూమి

జట్టు విజయాలకు కృషి చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోర్ట్ ఆఫ్ స్పెయిన్, ఆగస్టు 14: జట్టుకు విజయాలు అందించడానికి కృషి చేస్తానని, ప్రతి మ్యాచ్ తనకి ఎంతో కీలకమని భారత యువ వికెట్ రిషభ్ పంత్ అన్నాడు. బుధవారం పంత్ మీడియాతో మాట్లాడుతూ తను వ్యక్తి గతంగా భారీ స్కోరు సాధించాలని కోరు కుంటానని, కానీ ప్రతిసారీ అలా బరిలోకి దిగనని స్పష్టం చేశాడు. ప్రతి మ్యాచ్ నాకు ఎంతో కీలకమని, నా ఆటతీరును మరింతగా మెరుగు పర్చుకునేలా ప్రయత్నిస్తున్నట్లు చెప్పాడు. ప్రస్తు తం జట్టు సభ్యులమంతా విండీస్‌తో జరిగే చివరి మ్యాచ్ ను గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని అనుకుంటున్నా మని పేర్కొన్నాడు. అయతే ఇటీవల భారత జట్టు చేస్తున్న ప్రయోగాల గురించి మాట్లాడుతూ అందరికీ అవకాశాలి వ్వాలనే ఉద్ద్యేశంతోనే అప్పుడప్పుడు మార్పులు చోటుచేసు కుంటాయన్నాడు.
అయతే జట్టు యాజమాన్యం మంచి ప్రోత్సాహం అందిస్తోందని వివరించాడు. సీనియర్ బ్యాట్స్ మన్, వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనీ అందుబాటులో లేకపోవడంతో కరేబియన్ పర్యటనలో చోటు దక్కించు కున్న పంత్ ఇప్పటివరకు చెప్పుకోదగిన రీతిలో రాణించలే దు. మూడు టీ20 మ్యాచుల సిరీస్‌లో రెండింట్లో విఫల మవ్వగా, చివరి టీ20లో 65 పరుగులు చేశాడు. ఇక రెండో వనే్డలో 20 పరుగులు మాత్రమే చేసి నిరుత్సాహ పరిచాడు.