క్రీడాభూమి

వెంటనే వెనక్కి రండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు మేనేజర్ సునీల్ సుబ్రమణ్యంను వెంటనే తిరిగి స్వదేశానికి రావాలంటూ బుధవారం బీసీసీఐ ఆదేశించింది. వెస్టిండీస్ పర్యటనలో భాగంగా అక్కడి భారత హైకమిషన్ అధికారులతో సుబ్రమ ణ్యం అమర్యాదగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. దీంతో పర్యటన మధ్యలోనే ఆయన్ను వెనక్కి రావాలని ఆదేశించింది. అయతే దీనిని సీరియస్‌గా తీసుకున్న భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సుబ్రమణ్యంపై ఆగ్రహంగా ఉంది. పర్యటన మధ్యలోనే స్వదేశానికి పిలిపి స్తుండడంతో గట్టి చర్యలు తీసు కునే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు భవిష్యత్తులో నూ ఎలాంటి పదవులు చేపట్టకుండా నిషేధించే యోచనలో కూ డా ఉన్నట్లు సమాచారం.
అసలేం జరిగిందంటే..
భారత ప్రభుత్వం ఆదేశాల మేరకు నీటి పొదుపుపై కరేబియన్ పర్యటనలో ఉన్న క్రికెటర్లతో ఓ వీడియో చిత్రీకరించేందుకు సహకరించాలని అక్కడి భారత హైకమిషన్ అధికారులు సుబ్రమణ్యాన్ని కోరారు. సోమవారం జరగాల్సిన ఈ వీడియో చిత్రీకరణలో కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మలు పాల్గొనాల్సి ఉంది. అయతే దీనిపై భారత హై కమిషనర్ అధికారులు జట్టు మేనేజర్ సుబ్రమణ్యంను సంప్రదించగా వారితో అమర్యాదగా ప్రవర్తించాడు. ఇదే విషయాన్ని వారు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో సీఓఏ అతడిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే భారత్‌కు రావాలని ఆదే శించింది.
గతంలోనూ ఇలాగే..
తాజా ఘటనతో సుబ్రమణ్యంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమ వుతోంది. గతంలోనూ ఇతర దేశాల్లోని క్రికెట్ బోర్డు అధికారు లతో ఆ మర్యాదగా వ్యవహరించిన సందర్భాలున్నాయ. గతేడా ది డిసెంబర్‌లో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా పెర్త్ టెస్టు సమయంలో అక్కడి క్యాటరింగ్ సిబ్బంది, క్రికెట్ ఆస్ట్రేలియా ఆపరేషన్స్ మేనేజర్ ఆమ్‌ఫ్రాసెర్‌ను తన ప్రవర్తనతో సుబ్రమణ్యం ఇబ్బంది పెట్టాడు. అప్పటి చారిత్రాక టెస్టు విజ యం అనంతరం కోహ్లీ సేన సంబరాలు ముగిసిన తర్వాత మిగిలిపోయన వస్తువులను వ్యక్తిగత అవసరాల కోసం ఆయన తీసుకెళ్లారు. ఆ సమయంలో క్రికెట్ ఆస్ట్రేలియా అధికారులతో ఆయన అమర్యాదగా ప్రవర్తించారు.