క్రీడాభూమి

సిఎఎస్ నిర్ణయం శిరోధార్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెక్సికో సిటీ, మే 25: తనపై వేసిన సస్పెన్షన్ వేటును రద్దు చేయాలని కోరుతూ యూరోపియన్ ఫుట్‌బాల్ సంఘం (యుఫా) అధ్యక్షుడు మైఖేల్ ప్లాటినీ వేసిన కేసును కొట్టివేస్తూ క్రీడా మధ్యవర్తిత్వ కోర్టు (సిఎఎస్) తీసుకున్న నిర్ణయం తమకు నిర్ణయం శిరోధార్యమని అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (్ఫఫా) అధ్యక్షుడు గియానీ ఇన్‌ఫాంటినో స్పష్టం చేశాడు. సాకర్ రంగంలో ఆటగాడిగా, పాలనాదక్షుడిగా పేరుప్రఖ్యాతులు సంపాదించిన ప్లాటినీని ఫిఫా సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. 2011లో సెప్ బ్లాటర్ నాలుగోసారి ఫిఫా అధ్యక్షుడిగా పోటీ చేసినప్పుడు ప్లాటినీ కూడా రంగంలోకి దిగుతాడన్న ప్రచారం జరిగింది. కాగా, అప్పటికి పదేళ్ల క్రితం ఒక కాంట్రాక్టును ప్లాటినీ పూర్తి చేశాడని పేర్కొంటూ ఫిఫా ఖాతా నుంచి అతనికి రెండు మిలియన్ డాలర్లు (సుమారు 13 కోట్ల రూపాయలు) చెల్లించాడు. ఈ లావాదేవీ పూర్తయిన వెంటనే అధ్యక్ష పదవికి పోటీ నుంచి ప్లాటినీ వైదొలిగాడు. లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని, ఫిఫా నిధులను దుర్వినియోగం చేశారన్న కారణంగా బ్లాటర్, ప్లాటినీపై ఫిఫా క్రమశిక్షణ కమిటీ వేటు వేసింది. తనపై విధించిన సస్పెన్షన్‌పై ఫిఫా ట్రిబ్యునల్‌కు బ్లాటర్ అప్పీల్ చేసుకున్నాడు. ప్లాటినీ మాత్రం ముందుగానే నిర్ణయం తీసుకున్నారని ఆరోపిస్తూ ట్రిబ్యునల్ ముందు వివరణ ఇవ్వడానికి నిరాకరించాడు. ట్రిబ్యునల్ కూడా సస్పెన్షన్‌ను కొనసాగించాలని తీర్పునివ్వడంతో ప్లాటినీ సిఎఎస్‌ను ఆశ్రయించాడు. తాను నిర్దోషినని వాదించాడు. కానీ, సిఎఎస్ అతని అభ్యర్థనను తోసిపుచ్చింది. ఈ తీర్పు వెలువడిన వెంటనే యుఫా అధ్యక్ష పదవికి అతను రాజీనామా చేశాడు. ఈ విషయంపై ఇన్‌ఫాంటినో స్పందిస్తూ, ప్లాటినీని సమర్థుడైన పాలనాదక్షుడని ప్రశంసించాడు. అయితే, సిఎఎస్ నిర్ణయాన్ని వ్యతిరేకించే ప్రసక్తే లేదని స్పష్టం చేశాడు. కోర్టు తీర్పును అమలు చేయాల్సిన బాధ్యత ఫిఫా అధ్యక్షుడిగా తనపై ఉందన్నాడు. తాను అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత జరగనున్న తొలి ఫిఫా పాలక మండలి సమావేశంలో పలు అంశాలను ప్రస్తావించనున్నట్టు ఇన్‌ఫాంటినో చెప్పాడు. ఫిఫా అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తామని తెలిపాడు.