క్రీడాభూమి

బంగ్లాదేశ్ కోచ్‌గా డామింగో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢాకా, ఆగస్టు 17: బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు కొత్త కోచ్‌గా దక్షిణాఫ్రికాకు చెందిన రసెల్ డామింగో నియమితుడయ్యాడు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ)తో రెండేళ్ల ఒప్పందాన్ని కుదుర్చుకున్న 44 ఏళ్ల డామింగో బుధవారం ఢాకా చేరుకునే అవకాశాలున్నాయి. కోచ్‌గా అతనికి అపారమైన అనుభవం ఉందని, ఎక్కువ మంది యువ ఆటగాళ్లతో కూడిన జట్టుకు అతని సేవలు ఎంతగానో ఉపయోగపడతాయని బీసీబీ అధ్యక్షుడు నజ్ముల్ హసన్ ఒక ప్రకటనలో పేర్కొన్నాడు. ప్రపంచ కప్ క్రికెట్ చాంపియన్‌షిప్ తర్వాత కోచ్ స్టీవ్ రోడ్స్ కాంట్రాక్టు ముగిసింది. బీసీబీ డైరెక్టర్, మాజీ కెప్టెన్ ఖలీద్ మహమూద్ తాత్కాలికంగా కోచ్‌గా బాధ్యతలు స్వీకరించాడు. అయితే, జూలై మాసంలో శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌లో బంగ్లాదేశ్ 0-3 తేడాతో పరాజయాన్ని చవిచూసింది. ఈ చేదు అనుభవంతో కోచ్ ఎంపికపై బీసీబీ దృష్టి కేంద్రీకరించింది. చివరికి డామింగోను ఎంపిక చేసింది. 2013లో గారీ కిర్‌స్టెన్ నుంచి దక్షిణాఫ్రికా కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న డామింగో 2017 వరకూ అదే పదవిలో కొనసాగాడు. తాను బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు ఎదుగుదలను ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నానని, ఆ జట్టుకు కోచ్‌గా సేవలు అందించే అవకాశం రావడం తన అదృష్టమని పేర్కొన్నాడు.