క్రీడాభూమి

ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ మూడో రౌండ్‌కు హాలెప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, మే 25: ఆరో ర్యాంక్ క్రీడాకారిణి సిమోనా హాలెప్ ఇక్కడ జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్‌లో మూడో రౌండ్‌కు దూసుకెళ్లింది. బుధవారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో ఆమె జరినా దియాస్‌ను 7-6, 6-2 తేడాతో ఓడించింది. మొదటి సెట్‌లో గట్టిపోటీనిచ్చిన దియాస్ రెండో రౌండ్‌లో దారుణంగా విఫలమై, ఓటమిపాలైంది. మరో మ్యాచ్‌లో మెర్టిలి జార్జెస్‌ని నాలుగో సీడ్ గార్బినె ముగురుజా 6-2, 6-0 ఆధిక్యంతో చిత్తుచేసింది. ముగురుజా విజృంభణకు ప్రత్యర్థి నుంచి ఏ దశలోనూ ప్రతిఘటన ఎదురుకాలేదు. పదోసీడ్
పెట్రా
క్విటోవా కూడా మూడో రౌండ్‌లోకి అడుగుపెట్టింది. ఆమె రెండో రౌండ్‌లో హీష్ సుయ్ వెయ్‌ని 6-4, 6-1 తేడాతో ఓడించింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఓ మ్యాచ్‌లో అనస్తాసియా పవ్లిచెన్కోవా 6-3, 4-6, 6-1 స్కోరుతో కాగ్లా బయుకకేను ఓడించింది. నవోమీ ఒసాకా 6-3, 6-3 స్కోరుతో లూసీ బరోనీని ఇంటిదారి పట్టించింది. షెల్బీ రోజర్స్ 6-4, 6-2 తేడాతో ఎలెనా వెస్నినాపై గెలిచింది. 11వ సీడ్ లూసీ సఫరోవా 6-2, 6-2 తేడాతో విక్టోరిజా గొలుబిక్‌పై విజయం సాధించింది.
వావ్రిన్కా ముందంజ
ప్రపంచ మూడో ర్యాంక్ ఆటగాడు, డిఫెండింగ్ చాంపియన్ స్టానిస్లాస్ వావ్రిన్కా పురుషుల సింగిల్స్‌లో ముందంజ వేశాడు. రెండో రౌండ్‌లో అతను టారో డానియెల్‌ను 7-6, 6-3, 6-4 తేడాతో ఓడించి, మూడో రౌండ్‌కు దూసుకెళ్లాడు. జపాన్ సూపర్ స్టార్ కెయ్ నిషికొరి కూడా మూడో రౌండ్‌లోకి ప్రవేశించాడు. అతను రెండో రౌండ్‌లో ఆండ్రే కుజ్నెత్సోవ్‌ను 6-3, 6-3, 6-3 తేడాతో ఓడించాడు. ఫెర్నాండో వెర్డాస్కో 6-2, 6-1, 6-3 స్కోరుతో ఇవాన్ డోడింగ్‌పై విజయం సాధించాడు. జాక్ సాక్ 6-3, 7-6, 6-2 స్కోరుతో డస్టిన్ బ్రౌన్‌ను మట్టికరిపించగా, జెరెమీ చార్డీ 6-4, 6-2, 6-4 స్కోరుతో ఆడం పవ్లసెక్‌పై గెలిచాడు.
సాంటినా శుభారంభం
మహిళల డబుల్స్‌లో ‘సాంటినా’గా అందరూ పిలిచే సానియా మీర్జా, మార్టినా హింగిస్ జోడీ శుభారంభం చేసింది. మొదటి రౌండ్‌లో వీరు 7-6, 6-2 ఆధిక్యంతో డరియా కసట్కినా, అలెక్సాండ్రా పనోవా జోడీని సులభంగా ఓడించి రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టారు. వింబుల్డన్, యుఎస్, ఆస్ట్రేలియా ఓపెన్ డబుల్స్ టైటిళ్లను కైవసం చేసుకున్న సాంటినా జోడీ మరో గ్రాండ్ శ్లామ్ టైటిల్‌పై కనే్నసింది. అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్న వీరికి ఫ్రెంచ్ ఓపెన్ కూడా దక్కే అవకాశాలు లేకపోలేదు.

ఆస్ట్రేలియా బౌలింగ్ కోచ్‌గా
గిలెస్పీకి అవకాశం!
సిడ్నీ, మే 25: ఆస్ట్రేలియా జాతీయ జట్టు బౌలింగ్ కోచ్‌గా మాజీ ఫాస్ట్ బౌలర్ జాసన్ గిలెస్పీకి అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది. ఆస్ట్రేలియా మీడియా కథనాల ప్రకారం ప్రస్తుతం ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్‌లో కోచ్‌గా ఉన్న గిలెస్పీని స్వదేశానికి రప్పించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) కూడా ఈ దిశగా కృషి చేస్తున్నది. నాలుగేళ్లుగా యార్క్‌షైర్ కౌంటీ క్లబ్‌కు హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న గిలెస్పీ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు అప్పచెప్పిన పనిని సమర్థంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నానని, ఇతరత్రా జట్లకు కోచ్‌గా వెళ్లే ప్రసక్తి లేదని వ్యాఖ్యానించాడు. అయితే, అతనితో మాట్లాడి, ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నామని సిఎ అధికారి ఒకరు తెలిపాడు. ఇప్పుడే ఏమీ చెప్పలేమని, కానీ, గిలెస్పీ ఆస్ట్రేలియా బౌలింగ్ కోచ్‌గా రావడం దాదాపుగా ఖాయమైందని పేర్కొన్నాడు. భారత్‌లో జరిగిన టి-20 వరల్డ్ కప్ టోర్నమెంట్ పూర్తయిన వెంటనే బౌలింగ్ కోచ్‌గా ఉన్న క్రెక్ మెక్‌డార్మెట్ రాజీనామా చేశాడు. దీనితో కోచ్ బౌలింగ్ కోచ్ వేట మొదలైంది. ఆడం గ్రిఫిత్ పేరు వినిపిస్తున్నప్పటికీ గిలెస్పీకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని సమాచారం. సిఎ మాత్రం కొత్త బౌలింగ్ కోచ్ విషయంలో వౌనాన్ని వీడడం లేదు.