క్రీడాభూమి

ప్రణీత్, ప్రణయ్ ముందంజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాసెల్, ఆగస్టు 19: ప్రపంచ బాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌లో భారత ఆటగాళ్లు సాయి ప్రణీత్, హెచ్‌ఎస్ ప్రణయ్ తమతమ మొదటి రౌండ్ మ్యాచ్‌లను గెల్చుకొని, ముందంజ వేశారు. పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్‌లో 66వ ర్యాంకర్ జాసన్ ఆంథోనీ హో-షూని ఢీకొ న్న 19వ ర్యాంక్ ఆటగాడు ప్రణీత్ 21-17, 21-16 తేడాతో వరుస సెట్లలో ఓడించాడు. ప్రణీత్ పూర్తి ఆధిపత్యాన్ని కనబరచిన ఈ మ్యాచ్ 39 నిమిషాల్లోనే ముగిసింది. కాగా, మరో మొదటి రౌండ్ మ్యాచ్‌లో ప్రణయ్ 17-21, 21-10, 21-11 ఆధిక్యంతో ఈటూ హైనో (్ఫన్లాండ్)పై విజయం సాధించాడు. మొదటి సెట్‌ను చేజార్చుకున్నప్పటికీ అతను రెండో సెట్‌లో ఎదురుదాడికి దిగి, విజయభేరి మోగించాడు.