క్రీడాభూమి

పరస్పర ప్రయోజనాలపై త్వరలో శే్వతపత్రం: ఎడుల్జీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 19: పరస్పర ప్రయోజనాల అంశంపై త్వరలోనే శే్వతపత్రం విడుదల చేస్తామని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ)కి సుప్రీం కోర్టు నియమించిన పాలనాధికారుల బృందం (సీఓఏ) సభ్యురాలు డయానా ఎడుల్జీ ప్రకటించింది. సోమవారం ఆమె విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, కొంత మంది మాజీ క్రికెటర్లకు పరస్పర ప్రయోజనాలు కలిగే హోదాలు లేదా పదవులు ఉన్నాయని వచ్చిన విమర్శలపై లోతుగా చర్చ జరిపినట్టు తెలిపింది. క్రికెట్ రంగంలో ఒక వ్యక్తి రెండు పదవులను నిర్వహిస్తుంటే, పరస్పర ప్రయోజనాల అంశం తెరపైకి వస్తుందని సుప్రీం కోర్టు నియమించిన ఆర్ లోధా కమిటీ తన నివేదికలో స్పష్టం చేసింది. బీసీసీఐ ప్రక్షాళన కోసం ఈ కమిటీ చేసిన ప్రతిపాదనలను ఎలాంటి మార్పులు, చేర్పులు లేకుండా అమలు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఇలావుంటే, భారత క్రికెట్‌లో ఒకటి కంటే ఎక్కువ పదవుల్లో ఉన్న పలువురు క్రికెటర్లకు పరస్పర ప్రయోజనాలు చేకూరుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో సచిన్ తెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ వంటి హేమాహేమీలు ఉన్నారు. ఇలావుంటే, మాజీ కెప్టెన్లు దిలీప్ వెంగ్‌సర్కార్, గంగూలీతో తాము సోమవారం స్కైప్‌లో ఈ విషయాన్ని చర్చించి, వారి అభిప్రాయాలు తెలుసుకున్నట్టు సంజయ్ మంజ్రేకర్, ఇర్ఫాన్ పఠాన్, పార్థీవ్ పటేల్, అజిత్ అగార్కర్, రోహన్ గవాస్కర్‌తోపాటు, సీఓఏ సభ్యుడు రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ రవి థోడ్గే కూడా హాజరైన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఎడుల్జీ తెలిపింది. వీరందరితోనూ తాము చర్చించామని, అందరి అభిప్రాయలు సేకరించిన తర్వాత, శే్వత ప్రతం విడుదల చేస్తామని చెప్పింది. ఈ వివరాలను సుప్రీం కోర్టు దృష్టికి కూడా తీసుకెళతామని ఆమె తెలిపింది. లోధా కమిటీ ప్రతిపాదనలను తు.చ తప్పకుండా అమలు చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేసింది.