క్రీడాభూమి

మూడో టెస్టుకూ అదే జట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, ఆగస్టు 19: ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ సిరీస్ రెండో టెస్టులో ఆడిన జట్టునే మూడో టెస్టుకు ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దించాలని ఇంగ్లాండ్ జట్టు మేనేజ్‌మెంట్ నిర్ణయించింది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో మొదటి టెస్టును ఆస్ట్రేలియా 251 పరుగుల భారీ తేడాతో గెల్చుకున్న విషయం తెలిసిందే. కాగా, రెండో టెస్టు డ్రాగా ముగిసింది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 258 పరుగులకు ఆలౌట్‌కాగా, ఆస్ట్రేలియా తన మొదటి ఇన్నింగ్స్‌లో 250 పరుగులు చేయగలిగింది. ఎనిమిది పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని సంపాదించిన ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌ను ఐదు వికెట్లకు 258 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ప్రత్యర్థి ముందు 267 పరుగురుల లక్ష్యాన్ని ఉంచింది. కాగా, మ్యాచ్ డ్రాగా ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 6 వికెట్లకు 154 పరుగులు చేసింది. ఇలావుంటే, సిరీస్‌లో 0-1 తేడాతో వెనుకబడిన ఇంగ్లాండ్ ఈనెల 22వ తేదీ, శుక్రవారం నుంచి మొదలుకానున్న మూడో టెస్టులో సర్వశక్తులు ఒడ్డి ఆడేందుకు సిద్ధమైంది. గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమైన జేమ్స్ ఆండర్సన్ స్థానాన్ని యువ ఫాస్ట్ బౌలర్ జొఫ్రా ఆర్చర్ సమర్థంగా భర్తీ చేయడంతో ఇంగ్లాండ్ ఊపిరి పీల్చుకుంది. అందుకే, మూడో టెస్టులో ఎలాంటి ప్రయోగాలకు దిగకుండా, అదే జట్టును కొనసాగించాలని నిర్ణయించింది.