క్రీడాభూమి

ఆర్చర్ సూపర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, ఆగస్టు 19: ఇంగ్లాండ్ పేసర్ జొఫ్రా ఆర్చర్‌ను బ్రిటిష్ పత్రికలు ప్రశంసల్లో ముంచెత్తుతున్నాయి. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ మొదటి మ్యాచ్‌లో ఆడుతూ గాయపడిన జేమ్స్ ఆండర్సన్ స్థానంలో రెండో టెస్టుకు ఆర్చర్‌ను ఎంపిక చేశారు. ఈ అవకాశాన్ని అతను సద్వినియోగం చేసుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 29 ఓవర్లు బౌల్ చేసిన అతను 59 పరుగులకు రెండు వికెట్లు పడగొట్టాడు. మెరుపు వేగంతో వేసిన షార్ట్‌పిచ్ బంతితో ఆసీస్ స్టార్ బ్యాట్స్‌మన్, మాజీ కెప్టెన్ స్టీవెన్ స్మిత్‌ను గాయపరిచాడు. ఉద్దేశపూర్వకంగా అతను ఆ బంతిని సంధించనప్పటికీ, స్మిత్ వంటి గొప్ప బ్యాట్స్‌మన్‌ను సైతం బెంబేలెత్తించాడంటూ అతనిని అభిమానులు ప్రశంసిస్తున్నారు. రెండో ఇన్నింగ్స్‌లో 15 ఓవర్లు వేసిన అతను 32 పరుగులిచ్చి, మూడు వికెట్లు కూల్చాడు. ఆండర్సన్ వంటి గొప్ప పేసర్ స్థానాన్ని ఆర్చర్ సమర్థంగా భర్తీ చేశాడని ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్‌తోపాటు, ఇతర సభ్యులు కూడా అభిప్రాయపడుతున్నారు. కెరీర్‌లో తొలి టెస్టు ఆడిన తొలి టెస్టులోనే ఆర్చర్ తన సత్తా నిరూపించుకున్నాడు. ఇంగ్లాండ్ జట్టులో స్థిరమైన స్థానం దక్కించుకునే దిశగా అడుగులేస్తున్నాడు.
చిత్రం... జొఫ్రా ఆర్చర్