క్రీడాభూమి

అక్తర్ X యువీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 18: కెరీర్‌ను కొనసాగిస్తున్నప్పుడేకాదు.. రిటైరైన తర్వాత కూడా భారత్, పాకిస్తాన్ ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధాలు జరుగుతునే ఉన్నాయి. పాక్ మాజీ సూపర్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ చేసిన ట్వీట్‌కు భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ సరైన సమాధానమే ఇచ్చాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన యాషెస్ సిరీస్ రెండో టెస్టులో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవెన్ స్మిత్ గాయపడిన సంఘటన ట్విటర్‌లో వీరి మధ్య ఆసక్తికరమైన చర్చకు కారణమైంది. మొదటి ఇన్నింగ్స్‌లో 80 పరుగుల స్కోరవద్ద స్మిత్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, ఇంగ్లాండ్ యువ పేసర్ జొఫ్రా ఆర్చర్ వేసిన బంతి గంటకు సమారు 148.70 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చి, బలంగా మెడపై తగిలింది. అక్కడే కుప్పకూలిన స్మిత్ ప్రాథమిక చికిత్స తర్వాత కోలుకొని, రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. అయితే, జట్టు కోసం అతను మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చాడు. కానీ, ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేకపోయాడు. 92 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద, క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో ఎల్‌బీగా ఔటయ్యాడు. ఆతర్వాత ఫీల్డింగ్‌కుగానీ, రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కుగానీ రాలేదు. ఇలావుంటే, మెడకు గట్టి దెబ్బతగిలి స్మిత్ క్రీజ్‌లోనే కుప్పకూలితే, ఆర్చర్ కనీసం అతనివద్దకు కూడా వెళ్లలేదని అక్తర్ ట్వీట్ చేశాడు. తాను బౌలింగ్ చేసినప్పుడు ఎప్పుడైనా బ్యాట్స్‌మన్ గాయపడితే, తాను వెంటనే అతని వద్దకు వెళ్లేవాడినని పేర్కొన్నాడు. స్మిత్ గాయపడినప్పటికీ ఆర్చర్ పట్టించుకోకుండా నవ్వుకుంటూ వెళ్లిపోవడం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని వ్యాఖ్యానించాడు. కాగా, అక్తర్ ట్వీట్‌పై యువీ స్పందిస్తూ ‘గాయపడిన బ్యాట్స్‌మన్ వద్దకు వెళ్లేవాడినని నువ్వు చెప్పింది నిజం. అయితే, ఇలాంటి బౌలర్లు మరికొన్ని సంధిస్తానని సదరు బ్యాట్స్‌మన్‌ను హెచ్చరించడానికి మాత్రమే పరామర్శకు వెళ్లేవాడివి తప్ప నిజంగా ఆ సంఘటనపై స్పందించి కాదు’ అని పేర్కొన్నాడు. బ్యాట్స్‌మెన్‌గా గాయపరచడానికే అక్తర్ ప్రాధాన్యం ఇచ్చేవాడన్న విమర్శలు గతంలో ఉండేవి. అయితే, తాను చాలా మంచివాడినని నిరూపించుకునే ప్రయత్నంలో భాగంగా, బ్యాట్స్‌మన్‌ను పరామర్శించేవాడినని అక్తర్ ప్రకటించుకోవడంతో, యువీ దీటుగానే స్పందించాడు. అతని వైఖరి ఎలాంటిదనే విషయాన్ని చెప్పకనే చెప్పాడు.
చిత్రాలు.. యువరాజ్ సింగ్, షోయబ్ అక్తర్