క్రీడాభూమి

రహానే, విహారీ అర్ధ శతకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూలిడ్జి (ఆంటిగువా), ఆగస్టు 20: అజింక్య రహానే, హనుమ విహారీ అర్ధ శతకాలు సాధించిన భారత్ ‘ఏ’, వెస్టిండీస్ ‘ఏ’ జట్ల మధ్య జరిగిన మూడు రోజుల వామప్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. భారత్ ‘ఏ’ తొలి ఇన్నింగ్స్‌ను ఐదు వికెట్లకు 297 పరుగుల వద్ద డిక్లేర్ చేయగా, అందుకు సమాధానంగా విండీస్ ‘ఏ’ మొదటి ఇన్నింగ్స్‌లో 181 పరుగులకే ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో 116 పరుగులు ఆధిక్యాన్ని సంపాదించిన భారత్ ‘ఏ’ రెండో ఇన్నింగ్స్‌ను 78 ఓవర్లలో ఐదు వికెట్లకు 188 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. రహానే 54 పరుగులు చేయగా, హనుమ విహారీ 64 పరుగులు సాధించాడు. వెస్టిండీస్‌తో 22 నుంచి మొదలయ్యే మొదటి టెస్టు మ్యాచ్‌కి ఎంపికైన భారత టెస్టు జట్టులో వీరిద్దరూ సభ్యులు. ప్లేయింగ్ ఎలెవెన్‌లో చోటు దక్కించుకోవడానికి వీరు ముమ్మరంగా కృషి చేస్తున్నారు. కాగా, 305 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టిన విండీస్ ‘ఏ’, మ్యాచ్ డ్రాగా ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 47 పరుగులు చేసింది.
లోపాలు సరిదిద్దుకున్నా: ఉమేష్
తాను బౌలింగ్ లోపాలను సరిదిద్దుకున్నానని, వెస్టిండీస్‌తో జరిగే మొదటి టెస్టుకు అన్ని విధాలా సిద్ధంగా ఉన్నానని భారత పేసర్ ఉమేష్ యాదవ్ అన్నాడు. విండీస్ ‘ఏ’తో జరిగిన వామప్ మ్యాచ్‌లో భారత్ ‘ఏ’ తరఫున ఆడిన ఉమేష్ తొలి ఇన్నింగ్స్‌లో 10 ఓవర్లు బౌల్ చేసి, 19 పరుగులిచ్చి మూడు వికెట్లు కూల్చాడు. రెండో ఇన్నింగ్స్‌లో మూడు ఓవర్లు బౌల్ చేసే అవకాశం లభించింది. మూడు పరుగులిచ్చిన అతను వికెట్ తీయలేదు. మొత్తం మీద మ్యాచ్‌లో 13 ఓవర్లలో, 22 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టిన ఉమేష్ విండీస్‌తో జరిగే మొదటి టెస్టులో ఆడే అవకాశం తనకు లభిస్తుందన్న ఆశలతో ఉన్నాడు. జట్టు నుంచి దూరమైనప్పుడు లభించిన సమయాన్ని తాను సద్వినియోగం చేసుకున్నానని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. విదర్భ క్రికెట్ అకాడెమీలో, కోచ్ సుబ్రతో బెనర్జీ పర్యవేక్షణలో బౌలింగ్ తీరును మెరుగుపరచుకున్నానని చెప్పాడు. ముఖ్యంగా లైన్ అండ్ లెన్త్‌తోపాటు స్వింగ్‌పైనా దృష్టి పెట్టానని అన్నాడు. గతంలో తాను చేసిన పొరపాట్లను గుర్తించి, వాటిని సరిదిద్దుకున్నానని తెలిపాడు. ఇప్పుడు అన్ని విధాలా తాను టెస్టు ఆడేందుకు సిద్ధమని ప్రకటించాడు. 30 ఏళ్ల ఉమేష్ చివరి టెస్టును గత ఏడాది సెంబర్‌లో, ఆస్ట్రేలియాపై పెర్త్ మైదానంలో ఆడాడు. ఆతర్వాత లభించిన విరామాన్ని బౌలింగ్‌లో లోపాలను సరిచేసుకోవడానికి ఉపయోగించుకున్నానని ఉమేష్ తెలిపాడు. భవిష్యత్తులో పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్త పడతానని చెప్పాడు. అయితే, అతనికి ప్లేయింగ్ ఎలెవెన్‌లో చోటు దక్కుతుందా అన్నది అనుమానమే.