క్రీడాభూమి

విలియమ్‌సన్, ధనంజయ బౌలింగ్ యాక్షన్‌పై ఫిర్యాదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, ఆగస్టు 20: న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్, శ్రీలంక స్పిన్నర్ అకిల ధనంజయ బౌలింగ్ యాక్షన్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి ఫిర్యాదు అందింది. రెండు జట్ల మధ్య జరిగిన మొదటి టెస్టు మ్యాచ్ సమయంలో వీరి బౌలింగ్ యాక్షన్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్టు అనుమానంగా ఉందని మ్యాచ్ అధికారులుఐసీసీకి ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ ఐసీసీ మంగళవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. వీరిద్దరి బౌలింగ్ యాక్షన్‌పై వచ్చిన ఫిర్యాదును పరిశీలించిన ఐసీసీ వీరిని 14 రోజుల్లోగా పరీక్షకు హాజరుకావాల్సిందిగా ఆదేశించింది. ఆ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో, 29 ఏళ్ల విలియమ్‌సన్ కేవలం మూడు ఓవర్లు బౌల్ చేశాడు. అతను కెరీర్‌లో మొత్తం 73 టెస్టుల్లో 29 వికెట్లు కూల్చాడు. 25 ఏళ్ల ధనంజయ ఆల్‌రౌండర్‌గా ఎదుగుతున్నాడు. కేవలం ఆరు టెస్టులు ఆడిన అతను 33 వికెట్లు సాధించాడు. న్యూజిలాండ్‌పై మొదటి టెస్టును శ్రీలంక గెల్చుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. బయోమెట్రిక్ పరీక్షకు హాజరయ్యేందుకు ఐసీసీ వీరికి రెండు వారాల సుమయం ఇవ్వడంతో, 22వ తేదీ నుంచి మొదలయ్యే చివరిదైన రెండో టెస్టులో వీరు ఆడే అవకాశం ఉంది.