క్రీడాభూమి

వచ్చే ఆగస్టు వరకూ శ్రీశాంత్‌పై సస్పెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 20: భారత పేసర్ శ్రీశాంత్‌పై విధించిన సస్పెన్షన్ వచ్చే ఏడాది ఆగస్టు వరకూ కొనసాగుతుందని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) మధ్యవర్తి డీకే జైన్ స్పష్టం చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాజస్థాన్ రాయల్స్ తరఫున తలపడినప్పుడు, సహచరురు అజిత్ చండీలా, అంకిత్ చవాన్‌తో కలిసి స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు శ్రీశాంత్‌పై ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. బీసీసీఐ క్రమశిక్షణ కమిటీ కూడా ఈ అంశాన్ని ధ్రువీకరించింది. దీనితో 2013 ఆగస్టులో అతనిపై జీవితకాల సస్పెన్షన్ వేటు పడింది. తనపై బీసీసీఐ తీసుకున్న చర్యను సవాలు చేస్తూ శ్రీశాంత్ కోర్టును ఆశ్రయించాడు. చివరికి ఈ వివాదం సుప్రీం కోర్టుకు చేరింది. శ్రీశాంత్‌పై జీవితకాల సస్పెన్షన్‌ను ఎత్తివేయాల్సిందిగా ఈ ఏడాది మార్చి 15న బీసీసీఐని సుప్రీం కోర్టు ఆదేశించింది. శిక్షాకాలాన్ని ఖరారు చేయడానికి మధ్యవర్తిని నియమించాలని సూచించింది. స్పాట్ ఫిక్సింగ్‌కు సంబంధించిన సాక్ష్యాధారులు, ఇతరత్రా అంశాలను అధ్యయం చేసి, ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత జైన్ ఏడేళ్ల సస్పెన్షన్‌ను ఖాయం చేశాడు. సస్పెన్షన్‌కు గురై ఆరేళ్లు పూర్తికాగా, వచ్చే ఏడాది ఆగస్టు వరకూ ఇది అమల్లో ఉంటుందని, ఆతర్వాత అతను ఏ స్థాయిలోనైనా క్రికెట్ ఆడవచ్చని తెలిపాడు. ఇలావుంటే, ఇప్పటికే నాలుగు పదుల వయసుకు చేరువవుతున్న శ్రీశాంత్ అంతర్జాతీయ క్రికెట్ ఆడే అవకాశాలు లేవు. దేశవాళీ పోటీల్లో ఆడడం కూడా అనుమానంగానే ఉంది. కెరీర్‌లో అత్యంత కీలకమైన ఆరేళ్లను సస్పెన్షన్ కారణంగా పోగొట్టుకున్న శ్రీశాంత్ కెరీర్ ముగిసినట్టేనని చెప్పాలి.
చిత్రం...శ్రీశాంత్