క్రీడాభూమి

కోలుకోని స్మిత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, ఆగస్టు 20: మెడకు తగిలిన గాయం నుంచి పూర్తిగా కోలుకోని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవెన్ స్మిత్ బుధవారం నుంచి ప్రారంభం ఇంగ్లాండ్‌తో ప్రారంభం కానున్న మూడో టెస్టుకు దూరమయ్యాడు. అతను కోలుకుంటున్నాడని, ట్రైనింగ్ సెషన్‌కు కూడా హాజరయ్యాడని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, అతను పూర్తిగా కోలుకలేదని, అందుకే, ముందు జాగ్రత్తగా అతనికి హెడింగ్లేలో జరిగే మూడో టెస్టు నుంచి విశ్రాంతినిచ్చామని పేర్కొంది. రెండో టెస్టు ఆడుతున్నప్పుడు ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జొఫ్రా ఆర్చర్ వేసిన బౌన్సర్ బలంగా స్మిత్ మెడకు తగిలిన విషయం తెలిసిందే. క్రీజ్‌లో కుప్పకూలిన అతను సపోర్టింగ్ స్ట్ఫా సేవలతో తేరుకున్నాడు. ఆటను కొనసాగించలేక మైదానాన్ని వీడి వెళ్లినప్పటికీ, జట్టు పరిస్థితిని గమనించి మళ్లీ క్రీజ్‌లోకి దిగాడు. కానీ, ఆటపై దృష్టి కేంద్రీకరించలేక, 92 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద, క్రిస్ వోక్స్ బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. స్మిత్ గాయం నుంచి కోలుకున్నట్టు కనిపిస్తున్నప్పటికీ, పూర్తి ఫిట్నెస్‌తో లేడని ఆస్ట్రేలియా జట్టు డాక్టర్ రిచర్డ్ సా స్పష్టం చేశాడు. అతని సూచన మేరకే స్మిత్‌కు విశ్రాంతినివ్వాలని సీఏ నిర్ణయించింది. ఐదు మ్యాచ్ ఈ సిరీస్‌లో మొదటి టెస్టును ఆస్ట్రేలియా 251 పరుగుల తేడాతో గెల్చుకుంది. రెండో టెస్టు డ్రాగా ముగిసింది. గురువారం నుంచి ప్రారంభమయ్యే మూడో టెస్టులో ఇరు జట్లు ఆధిపత్యం కోసం సర్వశక్తులు ఒడ్డి పోరాడడం ఖాయంగా కనిపిస్తున్నది.
చిత్రం...కోచ్ జస్టిన్ లాంగర్‌తో కలిసి ప్రాక్టీస్ సెషన్‌కు హాజరైన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (ఎడమ)