క్రీడాభూమి

మూడో రౌండ్‌కు జొకోవిచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, మే 26: ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జొకోవిచ్ ఇక్కడ జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్‌లో మూడో రౌండ్ చేరాడు. గ్రాండ్ శ్లామ్స్‌లో మిగతా మూడు టోర్నీలు, ఆస్ట్రేలియా, వింబుల్డన్, యుఎస్ ఓపెన్‌లను కైవసం చేసుకున్న జొకోవిచ్‌ను ఫ్రెంచ్ ఓపెన్ చాలాకాలంగా ఊరిస్తునే ఉంది. 11 పర్యాయాలు విఫలమైన అతను 12వ సారి టైటిల్‌ను దక్కించుకునే ప్రయత్నంలో ఉన్నాడు. రెండో రౌండ్‌లో స్టీవ్ డార్సిస్‌ను ఢీకొన్న అతను 7-5, 6-3, 6-4 తేడాతో విజయం సాధించాడు. కాగా, తొమ్మిది పర్యాయాలు టైటిల్ సాధించి రికార్డు సృష్టించిన ‘క్లే కోర్టు కింగ్’ రాఫెల్ నాదల్ కూడా మూడో రౌండ్‌లోకి అడుగుపెట్టాడు. రెండో రౌండ్‌లో అతను ఫాకన్డో బాగ్నిస్‌ను 6-3, 6-0, 6-3 తేడాతో ఓడించాడు. మరో మ్యాచ్‌లో రాబర్టో బటిస్టా అగుట్ 7-6, 6-4, 6-1 ఆధిక్యంతో పాల్ హెన్రీ మథియూపై విజయం సాధించాడు. ఏడోసీడ్ థామస్ బెర్డిచ్ 6-1, 2-6, 6-2, 6-4 స్కోరుతో మలెక్ జజిరిపై గెలుపొందాడు. మహిళల విభాగంలో అనా ఇవానోవిచ్ 7-5, 6-1 తేడాతో కురుమీపై గెలిచి మూ డో రౌండ్‌లోకి ప్రవేశించింది. 8వ సీడ్ తిమి యా బసిన్‌స్కీ 6-4, 6-4 తేడాతో యూగెనీ బుచార్డ్‌పై గెలిచింది.

ప్రీ క్వార్టర్స్‌లో పేస్
పారిస్: మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో స్విట్జర్లాండ్‌కు చెందిన మాజీ ప్రపంచ నంబర్ వన్ మార్టినా హింగిస్‌తో కలిసి ఆడుతున్న భారత వెటరన్ ఆటగాడు లియాండర్ పేస్ ప్రీ క్వార్టర్స్ చేరాడు. అన్నా లెనా గ్రొయెన్‌ఫెల్డ్, రాబర్ట్ ఫరా జోడీపై పేస్, హింగిస్ 6-4, 6-4 తేడాతో గెలిచారు. మహిళల డబుల్స్‌లో సానియా మీర్జాతో కలిసి పోటీపడు తున్న హింగిస్ శుభారంభం చేసిన విషయం తెలిసిందే.