క్రీడాభూమి

మూడో రౌండ్‌కు సింధు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాసెల్, ఆగస్టు 21: ప్రపంచ బాడ్మింటన్ చాంపియన్‌షిప్స్ మహిళల సింగిల్స్‌లో తెలుగు తేజం పీవీ సింధు శుభారంభం చేసింది. తొలి రౌండ్‌లో బై లభించిన ఆమె రెండో రౌండ్‌లో చైనీస్ తైపీకి చెందిన పాయ్ యూను 21-14, 21-14 తేడాతో ఓడించింది. మొదటి నుంచి ఆధిపత్యాన్ని కనబరచిన ఆమె మ్యాచ్‌ని 43 నిమిషాల్లో ముగించింది. ఈ మెగా టోర్నీలో రెండు పర్యాయాలు రజతం, మరో రెండుసార్లు కాంస్య పతకాలను కైవసం చేసుకున్న సింధు ఈసారి స్వర్ణ పతకంపై కనే్నసింది. జైత్రయాత్రను కొనసాగించే దిశగా తొలి అడుగు ముందుకేసింది. మహిళల డబుల్స్ విభాగంలో జక్కంపూడి మేఘన, పూర్వీషా రామ్ జోడీ పరాజయాన్ని చవిచూసింది. వీరిపై షిహో టనాకా, కొహరు యొనెమోటో 21-8, 21-18 తేడాతో విజయం సాధించారు.
దూకుడు కొనసాగేనా?
ప్రపంచ బాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌లో భారత ఆటగాళ్లు హెచ్‌ఎస్ ప్రణయ్, సాయి ప్రణీత్ దూకుడు కొనసాగుతుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూడో రౌండ్‌లో వీరు బలమైన ప్రత్యర్థులను ఎదుర్కోనుండడమే ఇందుకు కారణం. ప్రణయ్ రెండో రౌండ్‌లో సీనియర్ ఆటగాడు లిన్ డాన్‌పై 21-11, 13-21, 21-7 తేడాతో సంచలన విజయాన్ని నమోదు చేశాడు. అయితే, మూడో రౌండ్‌లో అతను ప్రపంచ నంబర్ వన్ కెన్టో మొమొతోను ఢీకొనాల్సి ఉంది. రెండో రౌండ్‌లో కెన్టో 21-10, 21-7 ఆధిక్యంతో లూయిస్ ఎన్రిక్ పెనర్వెర్ పెరీరేను చిత్తుచేసి మూడో రౌండ్ చేరాడు. అసాధారణ ఫామ్‌లో ఉన్న నంబర్ వన్ ఆటగాడు కెన్టోను నిలువరించడం ప్రణయ్‌కు సాధ్యమవుతుందా అన్నది అనుమానమే. కాగా, ప్రణీత్ రెండో రౌండ్‌లో లీ డాంగ్ కియాన్‌ను 21-16, 21-15 తేడాతో ఓడించాడు. మూడో రౌండ్‌లో అతనికి ఆరో సీడ్ ఆంథోనీ సినిసుక జింటింగ్ ఎదురవుతాడు. జింటింగ్ రెండో రౌండ్‌లో జొబెల్ పెన్ట్రీపై 21-11, 21-19 తేడాతో విజయం సాధించి మూడో రౌండ్ చేరాడు. జింటింగ్‌ను ఓడించడం ప్రణీత్‌కు అసాధ్యం కాకపోయినా, సులభం కాదనేది వాస్తవం.
చిత్రం...పీవీ సింధు