క్రీడాభూమి

కివీస్‌పై భారత్ ప్రతీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టోక్యో : న్యూజిలాండ్‌పై భారత హాకీ జట్టు ప్రతీకారం తీర్చుకుంది. ఒలింపిక్ హాకీ టెస్టు ఈవెంట్ గ్రూప్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఎదుర్కొని 1-2 తేడాతో ఓటమిపాలైన భారత్ బుధవారం నాటి ఫైనల్లో ఎదురుదాడి చేసింది. 5-0 తేడాతో కివీస్‌ను చిత్తుచేసి సత్తా చాటుకుంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ ఏడో నిమిషంలోనే భారత్‌కు తొలి గోల్‌ను అందించాడు. ఆరంభం నుంచే న్యూజిలాండ్‌పై దాడులకు ఉపక్రమించిన భారత్ అదే వ్యూహాన్ని కొనసాగించింది. 18వ నిమిషంలో శంషేర్ సింగ్ గోల్ సాధించగా, 22వ నిమిషంలో నీలకంఠ శర్మ భారత్ ఖాతాలో మరో గోల్ వేశాడు. దీనితో 3-0 ఆధిక్యాన్ని సంపాదించిన భారత్ కొద్దిసేపు రక్షణాత్మక విధానాన్ని అనుసరించింది. న్యూజిలాండ్ నుంచి గట్టిపోటీ ఎదురుకాకపోవడంతో, మరోసారి దాడులకు దిగింది. సుర్సాహిబ్జిత్ సింగ్ 26వ నిమిషంలో గోల్ చేశాడు. మరో నిమిషం వ్యవధిలోనే మన్దీల్ సింగ్ గోల్‌ను సాధించాడు. 5-0 ఆధిక్యానికి చేరుకున్న తర్వాత భారత్ డిఫెన్స్‌కు ప్రాదాన్యం ఇచ్చింది. కివీస్ ఆటగాళ్లను ముందుకు దూసుకురాకుండా నిలువరిస్తూ, వ్యూహాత్మకమైన ఆటతో విజయభేరి మోగించింది.

చిత్రం...ఒలింపిక్ హాకీ టెస్టు ఈవెంట్ ఫైనల్లో న్యూజిలాండ్‌ను చిత్తుచేసిన భారత ఆటగాళ్ల ఆనందం.