క్రీడాభూమి

బ్యాటింగ్ కోచ్‌గా రాథోడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 22: టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా మాజీ క్రికెటర్ విక్రం రాథోడ్ ఎంపికయ్యాడు. సంజయ్ బంగార్ స్థానంలో అతనికి త్వరలోనే బాధ్యతలు స్వీకరిస్తాడు. కాగా, బౌలింగ్ కోచ్‌గా భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్‌గా ఆర్. శ్రీధర్ తమతమ స్థానాలను పదిలం చేసుకున్నారు. జాతీయ సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ సపోర్టింగ్ స్టాఫ్‌గా రాథోడ్, అరుణ్, శ్రీధర్ పేర్లను ప్రతిపాదించగా, బీసీసీఐ సానుకూలంగా స్పందించింది. 50 ఏళ్ల రాథోడ్ కెరీర్‌లో 6 టెస్టులు, 7 వనే్డ ఇంటర్నేషనల్స్ ఆడాడు. సందీప్ పాటిల్ చైర్మన్‌గా ఉన్న సమయంలో అతను జాతీయ సెలక్షన్ కమిటీ సభ్యుడిగా సేవలు అందించాడు. అండర్-19 బ్యాటింగ్ కోచ్‌గా రాథోడ్ చేసుకున్న దరఖాస్తుపై అతని బావ, ఆశిష్ కపూర్ స్పందించలేదు. ఆశిష్ కపూర్ అండర్-19 జాతీయ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా ఉన్నాడు. జాతీయ క్రికెట్ అకాడెమీ (ఎన్‌సీఏ)లో బ్యాటింగ్ కోచ్‌గా దరఖాస్తు చేసుకున్నప్పటికీ, అక్కడి నుంచి కూడా ఎలాంటి సమాధానం రాలేదు. ఇప్పుడు ఏకంగా టీమిండియాకే బ్యాటింగ్ కోచ్‌గా నియమితుడయ్యాడు.