క్రీడాభూమి

నిరాశపరచిన కోహ్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్త్ సౌండ్, ఆగస్టు 22: వెస్టిండీస్‌తో గురువారం ప్రారం భమైన మొదటి టెస్టు మ్యాచ్, తొలి ఇన్నింగ్స్‌లో టీమిండి యా కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిమానులను నిరాశ పరిచాడు. టాస్ గెలిచిన వెస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకోగా తొలుత బ్యా టింగ్‌కు దిగిన భారత్ కేవలం ఐదు పరుగుల స్కోరువద్ద మాయాంక్ అగర్వాల్ వికెట్‌ను కోల్పోయంది. 13 బంతు ల్లో 5 పరుగులు చేసిన అతనిని షాయ్ హోప్ క్యాచ్ పట్ట గా కెమెర్ రోచ్ ఔట్ చేశాడు. అదే ఓవర్‌లో చటేశ్వర్ పుజా రా వికెట్ కూడా కూలింది. 4 బంతుల్లో 2 పరుగులు చేసిన పుజారా కూడా షాయ్ హోప్‌కు దొరికిపోయాడు. 7 పరు గులకే రెండు వికెట్లు కోల్పోయన దశలో బ్యాటింగ్‌కు దిగి న కోహ్లీ భారీ స్కోరు సాధిస్తాడని, జట్టును ఆదుకుంటాడ ని అభిమానులు ఆశించారు. అయతే, అతను 12 బంతుల్లో 9 పరుగులు చేసి, షానన్ గాబ్రియల్ బౌలింగ్‌లో షమరా బ్రూక్స్ క్యాచ్ అందుకోగా వెనుదిరిగాడు. ఇటీవల కాలం లో అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్న అతను అనూహ్యం గా వికెట్ పారేసుకోవడంతో ప్రేక్షకులు డీలాపడిపోయారు. కాగా, ఓపెనర్ లోకేష్ రాహుల్ క్రీజ్‌లో నిలదొక్కుకోవడాని కి విశేష ప్రయత్నం చేయగా, అజింక్య రహానే అతనికి చ క్కటి సహకారాన్ని అందించాడు. వికెట్ల పతనాన్ని అడ్డుకు న్న వీరు భోజన విరామ సమయానికి భారత స్కోరును 3 వికెట్ల నష్టానికి 68 పరుగులకు చేర్చారు. అప్పటికి రాహుల్ 37, రహానే 10 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు.
అనంతరం ఆటను కొనసాగించిన టీమిండియా 93 ప రుగుల వద్ద రాహుల్ వికెట్‌ను కోల్పోయంది. అతను 44 పరుగులు చేసి, రాస్టన్ ఛేజ్ బౌలింగ్‌లో షాయ్ హోప్ క్యా చ్ పట్టడంతో వెనుదిరిగాడు. డ్రింక్స్ సమయానికి భారత్ 36 ఓవర్లలో 4 వికెట్లకు 97 పరుగులు చేయగలిగింది. విం డీస్ బౌలర్లకు పరీక్ష పెట్టిన అజింక్య రహానే 31 పరుగుల వద్ద అప్పటికి క్రీజ్‌లో ఉన్నాడు. ఫోర్త్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన హనుమ విహారీ ఇంకా పరుగుల ఖాతాను మొదలు తెరవలేదు. వర్షం కారణంగా పిచ్ తీరు పూర్తిగా మారిపో గా, పరుగుల కోసం భారత బ్యాట్స్‌మెన్ నానా తంటాలు పడుతున్నారు. వికెట్ బౌలింగ్‌కు అనుకూలంగా మారింది. దీనికితోడు భారత బ్యాట్స్‌మెన్ పేస్‌ను సమర్థంగా ఎదు ర్కోలేకపోతున్నారు.