క్రీడాభూమి

ప్రణయ్ నిష్క్రమణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాసెల్, ఆగస్టు 22: ప్రపంచ బాడ్మింటన్ చాంపియన్‌షిప్స్ నుంచి భారత ఆటగాడు హెచ్‌ఎస్ ప్రణయ్ నిష్క్రమించాడు. పురుషుల సింగిల్స్ మూడో రౌండ్‌లో ప్రపంచ నంబర్ వన్ కెన్టో మొమొతాను ఢీకొన్న అతను 19-21, 12-21 తేడాతో పరాజయాన్ని చవిచూశాడు. తొలి సెట్‌లో చివరి వరకూ గట్టిపోటీనిచ్చిన ప్రణయ్ రెండో సెట్‌లో అదే స్థాయిలో రాణించలేకపోయాడు. ప్రపంచ నంబర్ వన్ మొమొతా తన స్థాయికి తగినట్టు దాడికి దిగి, ప్రణయ్‌ని సులభంగానే ఓడించాడు.
ఏడో ర్యాంక్ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ మూడో రౌండ్ చేరాడు. ఇజ్రాయిల్‌కుచెందిన మిషా జిల్బెర్మన్‌పై అతను 13-21, 21-13, 21-16 తేడాతో విజయాన్ని నమోదు చేశాడు. మొదటి సెట్‌లో ఓటమిపాలైనప్పటికీ, పట్టుదలతో ఆటను కొనసాగించిన శ్రీకాంత్ తర్వాతి రెండు సెట్లను తన ఖాతాలో వేసుకొని, ప్రీ క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టాడు.
మహిళల సింగిల్స్ విభాగంలో సైనా నెహ్వాల్ మూడో రౌండ్ చేరింది. రెండో రౌండ్‌లో ఆమె నెర్లాండ్స్ క్రీడాకారిణి సొరయా డి విస్చ్ ఈబెర్జెన్‌ను 21-10, 21-11 ఆధిక్యంతో చిత్తుచేసింది.