క్రీడాభూమి

రష్యా ఒలింపిక్స్ బృందంలో షరపోవాకు స్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్కో, మే 26: నిషిద్ధ మాదక ద్రవ్యమైన మెల్డోనియంను వినియోగించి డోపింగ్ పరీక్షలో పట్టుబడిన టెన్నిస్ బ్యూటీ మరియా షరపోవాకు ఒలింపిక్స్‌లో పాల్గొనే రష్యా బృందంలో చోటు లభించింది. ఉత్ప్రేరకాన్ని వాడినట్టు స్వయంగా అంగీకరించిన షరపోవాపై అంతర్జాతీయ మహిళా టెన్నిస్ సమాఖ్య (డబ్ల్యుటిఎ) నాలుగేళ్ల నిషేధాన్ని విధించిన విషయం తెలిసిందే. అయితే, స్వెత్లానా కుజ్నెత్సొవా, అనస్తాసియా పవ్లిచెన్కోవా, దరియా కసాట్కినాతో పాటు షరపోవా పేరును కూడా టెన్నిస్ జట్టులో చేర్చారు. ఒకవేళ షరపోవా ఆడేందుకు వీల్లేదని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఒసి) అభ్యంతరం వ్యక్తం చేస్తే, ఆమె స్థానంలో యకతెరియన్ మస్కిమోవాను జట్టులోకి తీసుకుంటారు.