క్రీడాభూమి

ఎన్‌డీటీఎల్‌పై వాడా వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 23: భారత జాతీయ డోప్ టెస్టింగ్ ల్యాబొరేటరీ (ఎన్‌డీటీఎల్)పై ప్రపంచ డోపింగ్ నిరోధక విభాగం (వాడా) వేటు వేసింది. ఆరు నెలల పాటు ఈ ల్యాబ్స్‌లో డోప్ టెస్టులు జరిపేందుకు వీలు లేదని ఆదేశాలు జారీ చేసింది. టోక్యో ఒలింపిక్స్ సమీపిస్తున్న నేపథ్యంలోవ వాడా ఈ నిర్ణయం తీసుకోవడం భారత క్రీడా రంగాన్ని ఆందోళనకు గురిచేస్తున్నది. భారత డోపింగ్ నిరోధక విభాగం (నాడా) డోప్ పరీక్షలు జరపవచ్చని ప్రకటించింది. వాడా ప్రతినిధులు ఇటీవల జరిపిన తనిఖీల్లో ఎన్‌డీటీఎల్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పరికరాలు లేవని స్పష్టమైంది. ఈ ల్యాబ్స్‌లో డోప్ పరీక్షలు నిర్వహిస్తే తప్పుడు ఫలితాలు వచ్చే ప్రమాదం ఉందని తేలింది. ఆ బృందం సమర్పించిన నివేదిక ఆధారంగా ఎన్‌డీటీఎల్‌ను ఆరు నెలల పాటు నిషేధిస్తున్నట్టు వాడా ప్రకటించింది. ఒలింపిక్స్‌సహా వివిధ మేజర్ ఈ వెంట్లు, టోర్నీల్లో పాల్గొనే క్రీడాకారులకు నాడా పరీక్షలను నిర్వసించవచ్చు. అయతే, వారి నుంచి సేకరించిన శాంపిల్స్‌ను ఇతర దేశాల్లోని ల్యాబ్స్‌లో పరీక్ష చేయంచాల్సి ఉంటుంది. ఇది ఖరీదైన వ్యవహారమేగాక, ఫలితాల్లో ఆలస్యం జరిగే ప్రమాదం ఉంది. అంతేగాక, అంతర్జాతీయ క్రీడా రంగంలో భారత్ ప్రతిష్ట దెబ్బతింటుంది. ఈ సమస్య నుంచి బయట పడేందుకు ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.