క్రీడాభూమి

నాకు స్వార్థం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్త్ సౌండ్, ఆగస్టు 23: తనకు స్వార్థం లేదని, వ్యక్తిగత ప్రయోజనాల కంటే జట్టు ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తానని భారత టెస్టు స్పెషలిస్టు అజింక్య రహానే అన్నాడు. అందుకే, వెస్టిండీస్‌తో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్‌లో క్రీజ్‌లో నిలదొక్కుకోవాలని అనుకున్నానేగానీ సెంచరీపై దృష్టి పెట్టలేదని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. భారత జట్టు పరిస్థితి అత్యంత సంక్లిష్టంగా ఉన్న సమయంలో ఒంటరి పోరాటం కొనసాగిన రహానే 163 బంతులు ఎదుర్కొని, పది ఫోర్ల సాయంతో 81 పరుగులు సాధించాడు. నిజానికి సాధారణ పరిస్థితుల్లో చేసే సెంచరీ కంటే ఈ ఇన్నింగ్స్ జట్టుకు ఎంతగానో ఉపయోగపడింది. ఈ పోరాటాన్ని గురించి రహానే మాట్లాడుతూ క్రీజ్‌లో ఉన్నంత సేపూ తాను జట్టు గురించే ఆలోచిస్తానని అన్నాడు. తాను స్వార్థపరుడిని కానని, అందుకే, సెంచరీ గురించి పెద్దగా ఆలోచించలేదని తెలిపాడు. నిజానికి శతకం సాధిస్తే బాగా ఉండేదని, కానీ, ఇప్పుడు సెంచరీ చేయలేకపోయినా, జట్టుకు అండగా నిలిచాననే సంతృప్తి ఇప్పుడు తనకు ఉందని రహానే అన్నాడు. ఇటీవలే ఇంగ్లీష్ కౌంటీలో హాంప్స్‌షైర్ తరఫున ఆడిన అతను ఏడు మ్యాచ్‌ల్లో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ సాధించాడు. ఇంగ్లీష్ కౌంటీలో ఆడిన అనుభవం తనకు కెరీర్‌లో బాగా ఉపయోగపడుతుందనే అనుకుంటున్నానని చెప్పాడు. 25 పరుగులకే మూడు వికెట్లు పడిపోయిన దశలో బ్యాటింగ్‌కు దిగాననీ, సాధ్యమైనంత ఎక్కువ సమయం క్రీజ్‌లో నిలవాలన్న ఆలోచనతోనే ఆడానని చెప్పాడు. ఈ మ్యాచ్ ఫలితం ఎలా ఉంటుందో చెప్పలేనని, అయితే, పోరు హోరాహోవరీగా కొనసాగుతుందనేది మాత్రం వాస్తవమని పేర్కొన్నాడు.
భారత్ ఆలౌట్ 297
రహానే ఆదుకోవడంతో భార త జట్టు కోలుకుంది. తొలి ఇన్నిం గ్స్‌లో 297 పరుగులు చేయగలి గింది. అంతకు ముందు మొద టి రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్లకు 203 పరుగులు చేసింది. మాయాంక్ అగర్వాల్ (5), చటేశ్వర్ పుజా రా (2), కెప్టెన్ విరాట్ కోహ్లీ (9) తక్కువ స్కోర్లకే ఔట్‌కాగా, ఓపెనర్ లోకేష్ రాహుల్ 44, రహానే 81 పరుగులతో జట్టు ను ఆదుకోగా, హనుమ విహారీ 32 పరుగులు సాధించాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి రిషభ్ పంత్ 20, రవీంద్ర జడేజా 3 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. రెండో రోజు ఆట మొదలైన తర్వాత కొద్ది సేపటికే పంత్ వికెట్ పడింది. అతను 24 పరుగులు చేశాడు. ఇశాంత్ శర్మతో క లిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దిన రవీంద్ర జడేజా 58 పరుగులు సాధించాడు. ఇశాంత్ శర్మ 19 పరుగులు చేశాడు. మహ మ్మద్ షమీ డకౌటయ్యాడు. భారత్ 96.4 ఓవర్లలో 297 ప రుగులు చేసి ఆలౌటైంది. అప్పటికి జస్‌ప్రీత్ బుమ్రా 4 ప రుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. విండీస్ బౌలర్లలో కెమెర్ రోచ్ 66 పరుగులకు 4, షానన్ గాబ్రియల్ 71 పరుగులకు 3, రాస్టన్ ఛేజ్ 58 పరుగులకు 2 చొప్పున వికెట్లు పడగొట్టా రు. జాసన్ హోల్డర్ ఒక వికెట్ కూల్చాడు.