క్రీడాభూమి

కోచ్ పదవికి తొందరలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, మే 26: ఆస్ట్రేలియా జాతీయ జట్టు కోచ్ పదవి కోసం తాను తొందరపడడం లేదని, ప్రస్తుతానికి ఆ ఆలోచన కూడా తనకు లేదని జస్టిన్ లాంగర్ స్పష్టం చేశాడు. వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్లు కూడా తలపడే ముక్కోణపు వనే్డ సిరీస్‌కు ఆస్ట్రేలియా సిద్ధమవుతోంది. రెగ్యులర్ కోచ్ డారెన్ లీమన్ విశ్రాంతి తీసుకోవడంతో, అతని స్థానంలో జట్టుకు లాంగర్ కోచ్‌గా వ్యవహరిస్తాడు. క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ)తో లీమన్ కాంట్రాక్టు పూర్తికానున్న నేపథ్యంలో, లాంగర్‌తో అతని స్థానాన్ని భర్తీ చేసే అవకాశాలున్నాయి. ఇప్పటికే సిఎ అధికారులు ఈ ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్‌మన్‌తో చర్చలు కూడా జరిపారు. అయితే, తాను కోచ్ పదవి కోసం పరుగులు తీయడం లేదని లాంగర్ అన్నాడు. బుధవారం అతను విలేఖరులతో మాట్లాడుతూ ట్రై సిరీస్‌కు ఆసీస్ జట్టు సిద్ధంగా ఉందని చెప్పాడు. తన దృష్టి ఆ సిరీస్‌పైనే కేంద్రీకృతమైందని, రెగ్యులర్ కోచ్‌గా నియామకం దొరుకుతుందా లేదా అన్నది తాను ఆలోచించడం లేదని పేర్కొన్నాడు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరని, కాబట్టి ప్రస్తుతం కోచ్ పదవి గురించిన ఆలోచన లేదని అన్నాడు.

chitram జస్టిన్ లాంగర్