క్రీడాభూమి

సిసలైన ఆల్‌రౌండర్ గౌతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: సిసలైన ఆల్‌రౌండర్‌గా రికార్డు స్థాయి ప్రదర్శనతో ఆకట్టుకున్న కృష్ణప్ప గౌతం. బెంగళూరులో జరుగుతున్న కర్నాటక ప్రీమియర్ లీగ్ (కేపీఎల్)లో బళ్లారి బ్లాస్టర్స్ తరఫున శనివారం శివమొగ్గ లయన్స్‌తో తలపడిన అతను అజేయంగా 134 పరుగులు చేశాడు. అందులో సెంచరీని కేవలం 39 బంతుల్లో నమోదు చేయడం విశేషం. 56 బంతులు ఎదుర్కొన్న అతని స్కోరులో 7 ఫోర్లు, 13 సిక్సర్లు ఉన్నాయి. కేపీఎల్‌లో అత్యంత వేగంగా శతకాన్ని సాధించిన, అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మన్‌గా అతను రికార్డు సృష్టించాడు. వర్షం కారణంగా 17 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో గౌతం విజృంభణతో బళ్లారి బ్లాస్టర్స్ 3 వికెట్లకు 203 పరుగులు చేసింది. అనంతరం బౌలింగ్‌లోనూ విశేష ప్రతిభ కనబరచిన గౌతం కేవలం 15 పరుగులకే 8 వికెట్లు కూల్చాడు. దీనితో ప్రత్యర్థి జట్టు శివమొగ్గ లయన్స్ 16.3 ఓవర్లలో 133 పరుగులకే కుప్పకూలింది. బళ్లారి టస్కర్స్ 70 పరుగుల తేడాతో విజయం సాధించింది. గౌతం ఒంటి చేత్తో ఈ మ్యాచ్‌ని గెలిపించాడు. అయతే, రాష్ట్ర స్థాయ టీ-20 మ్యాచ్‌లకు గుర్తింపు లేని కారణంగా, కేపీఎల్‌లో అతని అరుదైన ప్రదర్శన రికార్డు పుస్తకాల్లో చేరే అవకాశం లేదు.
చిత్రం... కృష్ణప్ప గౌతం