క్రీడాభూమి

రహానే సెంచరీ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్త్ సౌండ్, ఆగస్టు 25: అజింక్య రహానే సెంచరీతో రాణించగా, తెలుగు వీరుడు హనుమ విహారీ 93 పరుగు లు చేసి, ఏడు పరుగుల తేడాతో శతకాన్ని చేజార్చు కున్నాడు. అతను ఔటైన వెంటనే, 7 వికెట్లకు 343 పరుగు ల వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేస్తున్నట్టు టీమిండి యా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రకటించాడు. మొదటి ఇన్నిం గ్స్ ఆధిక్యాన్ని కలుపుకొని, విండీస్ ముందు భారత్ 419 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచగలిగింది. మూడు వికెట్ల కు 185 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో మ్యాచ్ నాలుగో రోజు, ఆదివారం ఉదయం ఆటను కొనసాగించిన భారత్ జట్టు స్కోరుకు రెండు పరుగులు కలిసిన తర్వాత విరాట్ కోహ్లీ వికెట్ కోల్పోయంది. అతను 51 పరుగులు చేసి, రాస్టన్ ఛేజ్ బౌలింగ్‌లో జాన్ క్యాంప్‌బెల్‌కు దొరికాడు. ఫోర్త్ డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన విహారీ విండీస్ బౌలర్ల దాడికి దిగి పరుగులు రాబట్టాడు. క్రీజ్‌లో నిలదొక్కుకు న్న రహానే 102 పరుగులు చేసి, షానన్ గాబ్రియల్ బౌ లింగ్‌లో జాసన్ హోల్డర్ క్యాచ్ పట్టగా ఔటయ్యాడు. శ తకానికి చేరువైన విహారీ దురదృష్టవశాత్తు లక్ష్యాన్ని చేర కుండానే, జాసన్ హోల్డర్ బౌలింగ్‌లో షాయ్ హోప్ క్యా చ్ అందుకోగా వెనుదిరిగాడు. ఆ వెంటనే ఇన్నింగ్స్‌ను కో హ్లీ డిక్లేర్ చేశాడు. భారత్ తన ముందు ఉంచిన భారీ ల క్ష్యాన్ని ఛేదించడం విండీస్‌కు అసాధ్యమనే చెప్పాలి.